యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సాహో. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే… పోరాట ఘట్టాలకు పెద్దపీట వేసిన ఈ సినిమాలో… 90 శాతం యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రభాస్ డూప్ లేకుండా నటించాడట. అంతేకాదు… కేవలం యాక్షన్ సన్నివేశాల కోసమే రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు సమాచారం. ఇవి మాత్రమే కాకుండా… ఈ సినిమాకు సంబంధించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను బాలీవుడ్ మీడియాతో పంచుకున్నాడు ప్రభాస్. ఈ చిత్రంలో సరికొత్త యాక్షన్ సన్నివేశాలను తీర్చిదిద్దినట్టు ప్రభాస్ తెలిపాడు. ముఖ్యంగా దుమ్ముతోపాటు… వర్షంలోనూ సాగే ఫైట్ సీన్స్, అలాగే… పిడికిలి యుద్ధం తరహాలో సాగే యాక్షన్ ఎపిసోడ్స్… ఇలా ఈ చిత్రానికి యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని ప్రభాస్ చెబుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఆ మధ్య ‘బాహుబలి’ సిరీస్ కోసం బరువు పెరిగిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… ‘సాహో’ కోసం దాదాపు ఎనిమిది కిలోల వరకు బరువు తగ్గాడట. అలాగే… ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్ నిపుణులు పనిచేసినట్టు… వారి సలహా మేరకే సరైన కార్బోహైడ్రేట్స్ డైట్‌తో తాను బరువు తగ్గినట్టు వెల్లడించాడు ప్రభాస్. అది ఇప్పుడు యాక్షన్ సీన్స్ కోసం ఎంతో ఉపకరించిందని చెప్పాడు.
మరి ప్రభాస్ కట్ అవుట్‌కి సరిపడే ఆ యాక్షన్ సన్నివేశాలను చూడాలంటే… ఆగష్టు 15వరకు వేచి ఉండాల్సిందే.
[subscribe]
[youtube_video videoid=2UqswPJbzzA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: