య‌న్టీఆర్ ‘గండికోట రహస్యం’కు 50 ఏళ్ళు

NTR Gandikota Rahasyam Completes 50 Years,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Moive News,NTR Gandikota Rahasyam Movie Latest Updates,50 Years For NTR Gandikota Rahasyam Movie,NTR Gandikota Rahasyam Movie Turns 50 Years,50 Years of Gandikota Rahasyam Movie
NTR Gandikota Rahasyam Completes 50 Years

మహానటుడు స్వర్గీయ యన్.టి.రామారావు, జానపద బ్రహ్మ బి.విఠలాచార్య కలయికలో పలు జానపద చిత్రాలు రూపొంది ఘ‌న‌విజ‌యం సాధించాయి. వాటిలో ‘గండికోట రహస్యం’ ఒకటి. “ప్రజలే ప్రభువులు” అన్న మహోన్నతమైన సందేశంతో తెరకెక్కిన చిత్రమిది. య‌న్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించిన ఈ సినిమాలో జయలలిత, దేవిక క‌థానాయిక‌లుగా నటించారు. డి.వి.య‌స్.ప్రొడక్షన్స్ పతాకంపై ప్ర‌ముఖ నిర్మాత డి.వి.య‌స్.రాజు నిర్మించిన ఈ చిత్రంలో రాజనాల, మిక్కిలినేని, రాజబాబు, అల్లు రామలింగయ్య, హేమలత, రమాప్రభ, ప్రభాకర్‌ రెడ్డి తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

య‌న్టీఆర్ ఆస్థాన సంగీత దర్శకుడు టి.వి.రాజు స్వ‌ర‌ప‌రిచిన బాణీల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా “మరదలపిల్లా ఎగిరిపడకు”, “నీలాల నింగి మెరిసిపడే నిండు చందురుడా”, “తెలిసింది తెలిసింది అబ్బాయిగారు” పాట‌లు అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఈ మూడు పాటలు కూడా సి.నారాయణరెడ్డి కలం నుంచి జాలువారినవే కావ‌డం విశేషం. 1969 మే 1న విడుదలైన ‘గండికోట రహస్యం’… నేటితో 50 వసంతాలను పూర్తి చేసుకుంది.

గండికోట రహస్యం’ – కొన్ని విశేషాలు:

  • య‌న్టీఆర్ – విఠ‌లాచార్య‌- డి.వి.య‌స్‌.రాజు కాంబినేష‌న్‌లో మంగ‌మ్మ శ‌ప‌థం వంటి జ‌న‌రంజ‌క జాన‌ప‌ద చిత్రం త‌రువాత వ‌చ్చిన మ‌రో స‌క్సెస్‌ఫుల్ ఫోక్‌లోర్ మూవీ గండికోట ర‌హ‌స్యం.
  • య‌న్టీఆర్, విఠలాచార్య కలయికలో వచ్చిన ఏడో చిత్రమిది. అంతకుముందు ఈ క‌ల‌యిక‌లో ‘బందిపోటు’, ‘అగ్గిపిడుగు’, ‘మంగమ్మ శపథం’, ‘అగ్గిబరాటా’, ‘పిడుగు రాముడు’, ‘చిక్కడు దొరకడు’ వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి.
  • య‌న్టీఆర్, జయలలిత జంటగా నటించిన ఐదో సినిమా ఇది. ఈ చిత్రానికంటే ముందు ఈ జంట‌ ‘గోపాలుడు భూపాలుడు’, ‘చిక్కడు దొరకడు’, ‘బాగ్దాద్ గజదొంగ’, ‘కథానాయకుడు’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది.
  • య‌న్టీఆర్, నిర్మాత డి.వి.య‌స్.రాజు కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో సినిమా ‘గండికోట రహస్యం’. అంతకుముందు య‌న్టీఆర్ హీరోగా ‘మంగమ్మ శపథం’, ‘పిడుగు రాముడు’, ‘తిక్క శంకరయ్య’ వంటి చిత్రాలను నిర్మించారు డి.వి.య‌స్.రాజు. ఈ నాలుగు చిత్రాలకు టి.వి. రాజు సంగీత ద‌ర్శ‌కుడు కావ‌డం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =