చిరంజీవి `ఇద్ద‌రు మిత్రులు`కి 20 ఏళ్ళు

20 Years For Chiranjeevi Iddaru Mitrulu,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Moive News,Chiranjeevi Iddaru Mitrulu Movie Completes 20 Years,Chiranjeevi Iddaru Mitrulu Movie Latest Updates,Chiranjeevi Iddaru Mitrulu Movie Turns 20 Years,20 Years of Iddaru Mitrulu Telugu Movie
20 Years For Chiranjeevi Iddaru Mitrulu

మాతృత్వానికి మగరూపానివై నాన్నతనంలో కణ్వుడివై... అన్నగుణంలో కృష్ణుడివై బతుకంతా జతగా నిలిచే విధిలో పతినే మించిన తోడువై బంధుత్వాలకి అందని బంధం ఉందని చూపిన నేస్తమా… ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మ‌ధ్య ఉండే స్వ‌చ్ఛ‌మైన స్నేహాన్ని అచ్చ తెలుగు ప‌దాల‌తో ఆవిష్క‌రించిన స్నేహ‌గీతిక‌లోని చివ‌రి పంక్తులివి. ఆ పాట… బంగారం తెచ్చి వెండివెన్నల్లో ముంచి కాగా… ఆ చిత్రం ఇద్ద‌రు మిత్రులు (1999).

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెర జీవితంలోనే కాదు నిజ‌జీవితంలోనూ స్నేహానికి అధిక ప్రాధాన్య‌మిచ్చే మెగాస్టార్ చిరంజీవి… 1999లో రెండు చిత్రాల్లో న‌టించ‌గా… ఆ రెండు కూడా స్నేహం చుట్టూ తిరిగే క‌థ‌ల‌తో రూపొంద‌డం విశేషం. అందులో ఒక‌టి… స్నేహం కోసం కాగా… మ‌రొక‌టి ఇద్ద‌రు మిత్రులు. టైటిల్స్‌లోనే స్నేహాన్ని ప్ర‌తిబింబిస్తూ తెర‌కెక్కిన ఈ రెండు సినిమాల్లోనూ స్నేహితుడి పాత్ర‌ల్లో చ‌క్క‌గా ఒదిగిపోయారు చిరు. స్నేహం కోసం ఇద్దరు మ‌గ స్నేహితుల చుట్టూ తిరిగే క‌థ‌తో ఆద్యంతం హృద్యంగా తెర‌కెక్కితే… ఇద్ద‌రు మిత్రులు ఆడ‌, మ‌గ మ‌ధ్య ఉండే స్వ‌చ్ఛ‌మైన స్నేహానికి ప్ర‌తీక‌లా రూపొందింది.

ఇద్ద‌రు మిత్రులు విష‌యానికి వ‌స్తే నంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో ఉన్న ఒక క‌థానాయ‌కుడు ఇలాంటి స‌బ్జెక్ట్‌తో సినిమా చేయ‌డానికి ఒప్పుకోవ‌డ‌మంటే పెద్ద‌ సాహ‌స‌మే. … అది కూడా హిట్ల‌ర్‌, మాస్ట‌ర్‌, బావ‌గారూ బాగున్నారా!, చూడాల‌ని వుంది! వంటి వ‌రుస ఘ‌న‌విజ‌యాల‌తో కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్న‌ప్పుడు. అయితే… క‌థ న‌చ్చి ఈ సినిమాకి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు చిరు. ఇక‌ చిరు స్నేహితురాలి పాత్ర‌లో గ్లామ‌ర్ కి కేరాఫ్ అడ్ర‌స్‌లా ఉన్న సాక్షి శివానంద్ న‌టించ‌డం అప్ప‌ట్లో మ‌రో సంచ‌ల‌నం. వీరి మ‌ధ్య కెమిస్ట్రీ కూడా సినిమాకి ప్ల‌స్ అయ్యింది. పాట‌ల ప‌రంగానూ మెప్పించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన స్థాయిలో పెర్‌ఫార్మ్ చేయ‌క‌పోయినా… ఈ సినిమా వేసిన బాట‌లో నువ్వే కావాలి, వ‌సంతం, ఓ మై ఫ్రెండ్‌ వంటి చిత్రాలు గ‌ర్ల్ - బాయ్ ఫ్రెండ్‌షిప్ స‌బ్జెక్ట్‌తో తెర‌కెక్క‌డం విశేషం.

కె.రాఘ‌వేంద్ర‌రావు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ ఈ చిత్రంలో చిరుకి జోడీగా ర‌మ్య‌కృష్ణ న‌టించ‌గా… రంభ ఓ ప్ర‌త్యేక గీతంలో మెరిసింది. మెలోడీ బ్ర‌హ్మ‌ మ‌ణిశ‌ర్మ స్వ‌ర‌సార‌థ్యంలో పాట‌ల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి.1999 ఏప్రిల్ 30న విడుద‌లైన ఇద్ద‌రు మిత్రులు… నేటితో 20 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

[subscribe]


[youtube_video videoid=kk7nU6QHuWw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =