ఎన్జీకే ఆడియో రిలీజ్

NGK Movie Audio Out Now

7/జి బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలేవేరులే, యుగానికి ఒక్కడు సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీ రాఘవ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య చేస్తున్న సినిమా ఎన్జీకే (నంద గోపాల కృష్ణ). ఈ సినిమా ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒక బొమ్మ గీసేవాడు వాడి కొడుక్కి బొమ్మ గియ్యడం నేర్పిస్తే, మా నాన్న మిలట్రీరా, గోలీలాడుకోడం నేర్పిస్తాడా.. రక్తం చిందించి ధాన్యం పండించే ఒక్కో రైతుకి, ఈ దేశం బాగుండాలని కష్టపడే ఒక్కో కార్మికుడికి దేన్నైనా నిలదీసి అడిగే హక్కుంది.. అంటూ సూర్య చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా ఆడియోను కూడా రిలీజ్ చేశారు. ‘వడ్డీలోడు వచ్చెనే’.. ‘తిరగబడు’.. ‘ప్రేమ ఓ ప్రేమా’.. ‘అణచివేసినా’ అనే పాటలను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

కాగా ఈ సినిమాలో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ హీరోయిన్స్‌గా నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సమర్పణలో, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. దీనితో పాటు సూర్య నటిస్తోన్న మరో చిత్రం ‘కాప్పాన్’. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఆగస్టులో ఈ సినిమాను ప్రేక్షక్షుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

[subscribe]


[youtube_video videoid=5ompWj4q_-I]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − eleven =