బ్రిటీష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన స్వాతంత్ర్య సమరయోధుల జీవితాలను ఆవిష్కరిస్తూ భారతీయ తెరపై పలు చిత్రాలు రూపొందాయి. ఇప్పుడు… ఈ జాబితాలో మరో చిత్రం చేరుతోంది. అదే… ‘సైరా నరసింహారెడ్డి’. తొలి తరం తెలుగు పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇటీవల కేరళ అడవుల్లో కొన్ని కీలకమైన పోరాట సన్నివేశాలని చిత్రీకరించారు. దీంతో… నిర్మాణం దాదాపు పూర్తయినట్టేనని సమాచారం. ఇదిలా ఉంటే… సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను నేరేట్ చేసే ఓ ముఖ్యమైన పాత్ర ఉంటుందట. ఆ పాత్ర కోసం అనుష్క పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆ పాత్ర నేపథ్యంలో సాగే సన్నివేశాల చిత్రీకరణతో ఈ సినిమా పూర్తవుతుందని తెలుస్తోంది. త్వరలోనే అనుష్క ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు తదితరులు నటిస్తున్న సైరా
విజయదశమికి తెరపైకి వచ్చే అవకాశముంది. ఈ సినిమాకి సంగీతం: అమిత్ త్రివేది.
[subscribe]
[youtube_video videoid=qqwQveU3DHA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: