మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్ బ్యానర్స్ పై కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సూపర్ హిట్ మూవీ మన్మథుడు సీక్వెల్ మన్మథుడు 2 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సీనియర్ నటి లక్ష్మి, రావు రమేష్, వెన్నెల కిషోర్, తమిళ నటి దేవదర్శిని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మన్మథుడు 2 మూవీ ప్రస్తుతం పోర్చుగల్ దేశంలో జరుగుతుంది. కింగ్ నాగార్జున తో ఫస్ట్ టైమ్ నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ నాగార్జున పై ప్రశంసల వర్షం కురిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మన్మథుడు 2 మూవీ లో నటించడం ఒక అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ అని, నాగార్జున ఇగో లేని ఎక్సలెంట్ కో స్టార్ అని, సెట్స్ లో అందరినీ కంఫర్ట్ గా ఉంచుతారని, తాను ఎప్పటికీ నాగార్జున ఫ్యాన్ గా ఉంటానన్నారు. మన్మథుడు 2 మూవీ హిలేరియస్ గా ఉంటుందని, సెట్స్ లో నవ్వుతూనే ఉన్నామని, తాను ఎప్పుడూ సెట్స్ లో ఇలా లేనని, హీరో నాగార్జున, తన క్యారెక్టర్స్ డిఫరెంట్ గా ఉంటాయని అన్నారు. షూటింగ్ ను, ఫుడ్ ను ఎంజాయ్ చేశామని, నాగార్జున, నాగచైతన్య తో నటించానని, తండ్రీ కొడుకులు యిద్దరూ మంచి ప్రవర్తన కలవారని, పోర్చుగల్ వీధులలో షూటింగ్ జరిగిందని, కార్క్ అక్కడ ఫేమస్ అని కార్క్ జ్యుయలరీ, కొన్ని కళా ఖండాలు కొన్నానని రకుల్ తెలిపారు.
[subscribe]
[youtube_video videoid=bTwdo2RSqMo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: