‘ప్రేమతో మీ కార్తీక్’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమయ్యాడు కార్తికేయ. అయితే… గత ఏడాది నూతన దర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘RX 100’తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో. ఒకవైపు హీరోగా నటిస్తూనే… మరోవైపు కీలక పాత్రల్లోనూ నటించడానికి కార్తికేయ ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో… తనకు నటుడిగా మంచి బ్రేక్ ఇచ్చిన అజయ్ దర్శకత్వంలో మరోసారి నటించడానికి కార్తికేయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే హీరోగా కాకుండా… అతిథి పాత్రలో నటిస్తున్నాడట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… యువ సామ్రాట్ నాగ చైతన్య కథానాయకుడిగా అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’(వర్కింగ్ టైటిల్) పేరుతో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో… ఓ కీలకమైన అతిథి పాత్ర కోసం కార్తికేయను సంప్రదించాడట అజయ్. పాత్ర నచ్చడంతో… కార్తికేయ కూడా వెంటనే అంగీకరించాడని సమాచారం. త్వరలోనే కార్తికేయ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. కాగా ప్రస్తుతం కార్తికేయ… నాని, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న విషయం విదితమే. అలాగే… హీరోగా నటించిన హిప్పీ
త్వరలోనే తెరపైకి రానుంది.
[subscribe]
[youtube_video videoid=DQ1T0GI3g4Q]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: