రానా, సాయిపల్లవి కాంబినేషన్‌లో ‘విరాటపర్వం 1992’ పేరుతో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘నీది నాది ఒకే కథ’తో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న వేణు ఊడుగుల… ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీలో… రానా విద్యార్థి నాయకుడిగా కనిపించబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం… ఈ సినిమాకి సంబంధించి పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం… జూన్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాలో నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్ట్రసెస్ టబు, ప్రియమణి కీలక పాత్రల్లో నటించనున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు… వీరితో పాటు మరో సీనియర్ యాక్ట్రస్ కూడా ముఖ్య భూమికలో దర్శనమివ్వనుందని తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు… హిందీనాట స్థిరపడిన తెలుగింటి ఆడపడుచు జరీనా వహాబ్. ‘గాజుల కిష్టయ్య’, ‘అమరప్రేమ’, ‘హేమాహేమీలు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన జరీనా… అనంతరం పలు హిందీ చిత్రాలలో నటించింది. సుదీర్ఘ విరామం తరువాత మళ్ళీ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్తచరిత్ర’(2010)తో తెలుగులో దర్శనమిచ్చింది. దాదాపు దశాబ్దకాలం తర్వాత ఇప్పుడు ‘విరాటపర్వం 1992’తో ఈమె మరోమారు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.
[subscribe]
[youtube_video videoid=09CDzuJbjeA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: