‘96’ రీమేక్ అప్‌డేట్స్

96 Telugu Remake Latest Updates,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Moive News,96 Telugu Remake Movie Shooting Updates,96 Telugu Remake Shoot,Sharwanand and Samantha New Movie 96 Telugu Remake News,96 Telugu Remake Shoot in Kenya
96 Telugu Remake Latest Updates

తమిళంలో ఘన విజయం సాధించిన ‘96’ ను… తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌ ‘దిల్’ రాజు నిర్మిస్తున్నాడు. తమిళ వెర్షన్‌ని డైరెక్ట్ చేసిన ప్రేమ్‌కుమార్ తెలుగు వెర్ష‌న్‌కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఉగాదికి పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం… తాజాగా మారిషస్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ పాత్రధారి అయిన శర్వానంద్ పై ఓ ఇంట్రడక్షన్ సాంగ్‌ను కూడా చిత్రీక‌రించారు. అనంత‌రం చిత్ర బృందం కెన్యాకు చేరుకుంది. శనివారం నుంచి మొద‌లైన కెన్యా షెడ్యూల్‌ 15 రోజుల పాటు సాగ‌నుందని స‌మాచారం. ఈ షెడ్యూల్‌లో శర్వా పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తార‌ట‌. అనంత‌రం త‌దుప‌రి షెడ్యూల్స్‌ను హైదరాబాద్, వైజాగ్‌లో ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు… హైదరాబాద్ షెడ్యూల్ నుంచి సామ్ కూడా షూటింగ్‌లో జాయిన్ అవుతుంద‌ట‌. అలాగే… హైదరాబాద్, విశాఖపట్నం షెడ్యూల్స్‌తో షూటింగ్‌ పార్ట్ మొత్తం పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. కాగా… జాను అనే టైటిల్ ప్ర‌చారంలో ఉన్న ఈ సినిమా సెప్టెంబ‌ర్‌లో తెర‌పైకి రానుంద‌ని స‌మాచారం.

[subscribe]


[youtube_video videoid=3DUXiGluVjo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + ten =