ఎనర్జిటిక్ స్టార్ రామ్ , పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా షూటింగ్ మాత్రం ఎలాంటి బ్రేక్ లు లేకుండా చాలా ఫాస్ట్ గా జరుపుకుంటుంది. ఇప్పటికే పలు షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా తాాజాగా హైదరాబాద్ లో షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
తరువాత షెడ్యూల్ ను వారణాసి లో జరుపుకోనుంది. రేపటి నుంచి కాశీలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. రామ్ పై కొన్ని యాక్షన్స్ సీన్స్ ను అక్కడ చిత్రీకరించనున్నారట. ఈ విషయాన్ని ఛార్మీ అధికారికంగా తెలియజేసింది. మరి ఈ షెడ్యూల్ తో ఈసినిమా షూటింగ్ పూర్తవుతున్నట్టు తెలుస్తోంది.
కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్, నభా నటేష్ కథానాయికలు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కొత్త లుక్ తో .. కొత్త బాడీ లాంగ్వేజ్ తో .. డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో రామ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇక పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో ఫస్ట్ టైమ్ రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి పూరీ చెప్పినట్టే మే నెలకల్లా పూటింగ్ పూర్తి చేసి… మే నెలలో సినిమా రిలీజ్ చేసేలాగానే ఉన్నాడు. మరి చూద్దాం ఈ సినిమాతో వీరిద్దరికీ సక్సెస్ అందుతుందేమో..
[subscribe]
[youtube_video videoid=2rRlDrGXa18]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)