మహేష్ బాబు సిల్వర్ జూబ్లి సినిమా మహర్షి కోసం అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రమోషన్ లో భాగంగా పాటలను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఐదు పాటలను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మే 1 వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. మే 9 వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా జ్యూక్ బాక్స్ ను కొద్దిసేపటి క్రితమే యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. కామెడీ హీరో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై ‘దిల్’ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
[subscribe]
[youtube_video videoid=YLqUCNxg8HM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: