‘చిత్రలహరి’ అందించిన విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు మెగా హీరో సాయితేజ్. ఈ నేపథ్యంలో… తన తదుపరి చిత్రాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగా… తాజాగా యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సాయితేజ్. జూన్ నుంచి పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గతంలో మారుతి రూపొందించిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమాను కూడా ఇవే సంస్థలు నిర్మించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో సినిమా రానుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో తాత, తండ్రి, మనవడు… ఇలా మూడు తరాలకు చెందిన వ్యక్తుల అనుబంధాలను తెరపై చూపించబోతున్నారని టాలీవుడ్ టాక్. మరి డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో కథలను సిధ్ధం చేసుకుని వాటిని తనదైన శైలిలో వినోదాత్మకంగా ఆవిష్కరించే మారుతి… ఈ సారి కూడా ఆ ఫీట్‌ని రిపీట్ చేస్తాడేమో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=gIQHYdck5Dk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: