
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 26


చిరు హీరోగా ‘దిల్’ రాజు సినిమా!?

హృతిక్ రోషన్‌తో ధనుష్ మల్టీ స్టారర్?

K.G. F చాఫ్టర్ 2 మూవీ లో "అధీరా "

విజయ్ దేవరకొండ ‘పెళ్లిచూపులు’కు మూడేళ్ళు

చైతూ... ముచ్చటగా మూడోసారి
హీరో ఆగలేదు - ఆ సినిమా తరువాత

ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం

నానితో యు.వి.క్రియేషన్స్ చిత్రం?
‘భీష్మ’ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

గుణ 369 ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు

ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ లో మన ప్యానల్ ఘన విజయం

మొదటి సారి కలిసిరాని అదృష్టం

44ఇయర్స్ సక్సెస్ ఫుల్ సినీ "ప్రస్థానం "

ఫిమేల్ సెంట్రిక్ మూవీ లో హీరోయిన్

రూలర్ మూవీలో సీనియర్ హీరోయిన్

అదే బాటలో ‘వెంకీమామ’

డియర్ కామ్రేడ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డియర్ కామ్రేడ్. ఈనెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ తో భారీ ఓపెన్సింగ్ ను దక్కించుకుంది. కలెక్షన్ల పరంగా మాత్రం ఎలాంటి ఢోకా లేకుండా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. మొదటి రోజు నైజాంలో 2.73 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం వారాంతం ముగిసేనాటికి 5.68 కోట్ల షేర్ సాధించింది. ఒక్క ఆదివారమే ఈ మూవీ 1.39 కోట్ల నిజాం షేర్ పొందింది. మరి ఫస్ట్ వీకెండ్ డియర్ కామ్రేడ్ ఏయే ఏరియాలో ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం..

చిరు హీరోగా ‘దిల్’ రాజు సినిమా!?
మెగా కాంపౌండ్ హీరోలకి కలిసొచ్చిన నిర్మాతలలో 'దిల్' రాజు ఒకరు. రామ్ చరణ్ (ఎవడు), అల్లు అర్జున్ (ఆర్య, పరుగు), వరుణ్ తేజ్( ఫిదా, ఎఫ్ 2), సాయి ధరమ్ తేజ్ (సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం)... ఇలా మెగా క్యాంప్ హీరోలతో రాజు నిర్మించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి.

హృతిక్ రోషన్‌తో ధనుష్ మల్టీ స్టారర్?
తమిళనాట దూసుకుపోతున్న యువ కథానాయకుల్లో ధనుష్ ఒకరు. ఒకవైపు కోలీవుడ్‌లో స్టార్ హీరోగా రాణిస్తూనే... మరోవైపు ఇతర భాషల్లోనూ దర్శనమిస్తూ ఉంటాడు ఈ టాలెంటెడ్ హీరో.

K.G. F చాఫ్టర్ 2 మూవీ లో "అధీరా "
సూపర్ హిట్ ఉగ్రం మూవీ తో శాండల్ వుడ్ కు దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ నీల్ తన రెండవ మూవీ K.G. F చాఫ్టర్1 తో స్టార్ డైరెక్టర్ గా మారారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా కన్నడంలో రూపొందిన K.G. F చాఫ్టర్1 మూవీ 2018 సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ గా నిలిచింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి.

విజయ్ దేవరకొండ ‘పెళ్లిచూపులు’కు మూడేళ్ళు
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం 'పెళ్ళిచూపులు'. సోలో హీరోగా విజయ్ నటించిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. తరుణ్ భాస్కర్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో రీతూ వర్మ కథానాయికగా నటించింది. ప్రియదర్శి, నందు, అనీష్ కురువిల్లా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా ద్వారా... వివేక్ సాగర్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. వివేక్ అందించిన బాణీలు ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి.

చైతూ... ముచ్చటగా మూడోసారి
కథానాయకుడిగా యువసామ్రాట్ నాగచైతన్యది పదేళ్ల ప్రస్థానం. ఈ ప్రయాణంలో ఏడాదికి ఒకటి లేదా రెండు చిత్రాలకే పరిమితమైన సందర్భాలే ఎక్కువ. అయితే... 2011, 2014 సంవత్సరాల్లో మాత్రం చైతు మూడేసి సినిమాలతో సందడి చేశాడు. 2011లో '100% లవ్, దడ, బెజవాడ' చిత్రాలతో పలకరించిన చైతు... 2014లో 'మనం, ఆటోనగర్ సూర్య, ఒక లైలా కోసం' తో అలరించాడు. కట్ చేస్తే... ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ముచ్చటగా మూడోసారి ఒకే క్యాలెండర్ ఇయర్ లో మూడేసి సినిమాలతో పలకరించబోతున్నాడు నాగ చైతన్య.
హీరో ఆగలేదు - ఆ సినిమా తరువాత
భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా విజయ్ డియర్ కామ్రేడ్ చేస్తున్నప్పుడే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఒకటి కాగా.. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో వస్తున్న హీరో ఒకటి.

ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా నారాయణ దాస్ కృష్ణ దాస్ నారంగ్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మిగిలిన కార్యవర్గ సభ్యులుగా ఈ కింది వారు ఎన్నికయ్యారు.

బన్నీ - త్రివిక్రమ్ మూవీ ఫస్ట్ లుక్ డిటైల్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, సుశాంత్, నివేద పేతురాజ్ ముఖ్య భూమికలు పోషిస్తున్నారు.

నానితో యు.వి.క్రియేషన్స్ చిత్రం?
యువ కథానాయకుడు నాని... ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి 'గ్యాంగ్ లీడర్' కాగా... మరొకటి 'వి'. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న 'గ్యాంగ్ లీడర్' సెప్టెంబర్ ప్రథమార్ధంలో విడుదల కానుండగా... ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కిస్తున్న 'వి' డిసెంబర్ ద్వితీయార్థంలో రిలీజ్ కానుందని సమాచారం.
‘భీష్మ’ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్
నితిన్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే... గత నెలలో సెట్స్ పైకి వెళ్ళిన ఈ చిత్రం... తాజాగా తొలి దశ చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

గుణ 369 ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు
జయాపజయాలతో పనిలేకుండా ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే హిప్పీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ... ఇప్పుడు 'గుణ 369' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బోయపాటి దగ్గర అసోసియేట్ గా పనిచేసిన అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.

ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గా నారాయణదాస్ కె నారంగ్
గత కొన్ని రోజులుగా తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఆ క్రమంలో ఈ సారి జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు కూడా సర్వత్రా ఆసక్తిని పెంచాయి. ఈ ఎన్నికల్లో ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి బరిలోకి దిగిన ఏసియన్ సినిమాస్ అధినేత నారాయణదాస్ కె నారంగ్ గారు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికపై పరిశ్రమ నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ లో మన ప్యానల్ ఘన విజయం
ఈరోజు జరిగిన తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్( తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి) ఎన్నికలలో సీ. కళ్యాణ్- ప్రసన్న కుమార్ ల ఆధ్వర్యంలోని " మన ప్యానల్" ఘన విజయాన్ని సాధించింది. ఈ.సీ .మెంబర్స్ 12 మందికి గాను 9 మంది, సెక్టార్ మెంబెర్స్ 20 మందికి గాను 16 మంది " మన ప్యానెల్" అభ్యర్థులు విజయాన్ని సాధించారు.

మొదటి సారి కలిసిరాని అదృష్టం
ఏ ఇండస్ట్రీలో అయినా వారసత్వ సంప్రదాయం అనేది కామన్ థింగ్. తాతలు, తండ్రుల అండతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ లు అయిన వాళ్లు ఉన్నారు. జీరో అయినవాళ్లు కూడా ఉన్నారు. కానీ.. చిన్న హీరో అయినా... పెద్ద హీరో అయినా.. అప్ కమింగ్ హీరో అయినా.. వారసత్వ హీరోలైనా ఎవరి భవిష్యత్ అయినా సరే బాక్సాఫీస్ డిసైడ్ చేయాల్సిందే. అందుకే స్టార్ హీరోలతో పాటు కూడా అప్ కమింగ్ హీరోల రేంజ్ కూడా మారిపోతుంది. దానికి కారణం ఇటీవల వచ్చిన సినిమాలే. పెద్ద సినిమాలను సైతం కాదని.. చిన్న సినిమాలను సైతం అందలం ఎక్కిస్తున్నారు. అందుకే వారసత్వ హీరోలను కాదని.. కొత్త హీరోలను పైకి ఎత్తేస్తున్నారు. అలా అప్పటి నుండి ఇప్పటి వరకూ…

44ఇయర్స్ సక్సెస్ ఫుల్ సినీ "ప్రస్థానం "
1975 సంవత్సరంలో దేవుడు చేసిన పెళ్ళి మూవీ లో బాలనటుడిగా టాలీవుడ్ కు ఎంటరయిన సాయికుమార్ 2019 మహర్షి మూవీ లో నటించి 44 సంవత్సరాల సినీ కెరీర్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. తెలుగు, కన్నడ మూవీస్ లో హీరోగా వెలుగొందిన సాయికుమార్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ కు పెట్టింది పేరుగా మారారు. సాయి కుమార్ పోలీస్ ఆఫీసర్ గా రూపొందిన కన్నడ మూవీ పోలీస్ స్టోరీ ఘనవిజయం సాధించింది. తెలుగు, తమిళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా విజయం సాధించాయి. పోలీస్ స్టోరీ మూవీ కి సీక్వెల్ మూవీస్ కూడా రూపొందాయి.

ఫిమేల్ సెంట్రిక్ మూవీ లో హీరోయిన్
అంతకు ముందు ఆ తరువాత హిట్ మూవీ తో ఈషా రెబ్బా టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ఈషా రెబ్బా నటించిన అమీ తుమీ, అ, అరవింద సమేత వీర రాఘవ మూవీస్ విజయం సాధించాయి. బెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ గా సినీగోయర్స్ అవార్డ్, బెస్ట్ పెర్ ఫార్మర్ గా తెలుగు అప్సర అవార్డ్ అందుకొన్న ఈషా రెబ్బా ఇప్పుడు ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు.

రూలర్ మూవీలో సీనియర్ హీరోయిన్
దర్శకుడు KS రవికుమార్, బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన జై సింహా మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో మరొక మూవీ రూపొందనుంది. సి. కళ్యాణ్ నిర్మాణ సారథ్యం లో KS రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందనున్న యాక్షన్ డ్రామా రూలర్ మూవీ షూటింగ్ ఆగస్ట్ 7వ తేదీ బ్యాంకాక్ లో ప్రారంభం కానుంది. బ్యాంకాక్ లోహై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తారని సమాచారం.

'ఆర్ ఎక్స్ 100’ సెన్సేషన్... ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్
‘ఆర్ ఎక్స్ 100’తో టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు చైతన్ భరద్వాజ్. అంతేకాదు... మొదటి సినిమాతోనే తన స్వరాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కాగా... తాజాగా 'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ నటించిన ‘గుణ 369’తో పాటు... ‘కింగ్’ నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘మన్మథుడు 2’కి స్వరాలు సమకూర్చాడు చైతన్. ఈ రెండు సినిమాలు కూడా వారం రోజుల గ్యాప్ లో థియేటర్లలోకి రానున్నాయి. ఇదిలా ఉంటే... ఇంతవరకు చైతన్ సంగీతం అందించిన సినిమాల తాలూకు టైటిల్స్‌ను నిశితంగా పరిశీలిస్తే... ఓ ఆసక్తికరమైన విషయం స్పష్టమవుతుంది.

అదే బాటలో ‘వెంకీమామ’
అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘వెంకీమామ’. రియల్ లైఫ్‌లో మేనమామ, మేనల్లుడు అయిన వెంకీ, చైతూ... వెండితెరపై కూడా అవే పాత్రలు పోషిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లో వెంకీ రైస్ మిల్ ఓనర్‌గా దర్శనమివ్వనుండగా... చైతూ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.