
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 25


నేషనల్ వైడ్ గా ప్రభాస్ టూర్

బాలకృష్ణ కు విలన్ గా సింహా హీరోయిన్

రానా నిర్మాతగా ప్రముఖ క్రికెటర్ బయోపిక్

రష్మిక తమిళ మూవీ ఆగస్ట్ లో ప్రారంభం
అంచనాలను పెంచుతున్న అశ్వమేథం
అఖిల్ సరసన నాని హీరోయిన్!?

కాజల్ అగర్వాల్ ప్రయోగాత్మక మూవీ
సెన్సార్ పూర్తి చేసుకున్న `రాక్షసుడు`

పల్లెటూరి దొరబాబు గెటప్
మరోసారి మెగాస్టార్ కి జోడిగా...

మహేష్ బాబు ‘రాజకుమారుడు’కు 20 ఏళ్ళు

తరుణ్ భాస్కర్ కు హీరోయిన్ ఫిక్స్

అత్తా కోడళ్లుగా స్నేహ, మెహ్రీన్

ప్రస్థానం టీజర్ రిలీజ్

కీలక పదవి దక్కించుకున్న అలీ

గాసిప్స్ పై స్పందన

నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో చిరు, కొరటాల మూవీ ?
ప్రతిష్టాత్మక మూవీ సైరా నరసింహా రెడ్డి తరువాత మెగా స్టార్ చిరంజీవి సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో నటించనున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వం లో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందే యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. చిరంజీవి యువకుడు, మిడిల్ ఏజ్డ్ పర్సన్ గా నటించే ఈ మూవీ ఆగస్ట్ 22 వ తేదీ చిరంజీవి బర్త్ డే సందర్భంగా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

నేషనల్ వైడ్ గా ప్రభాస్ టూర్
బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'సాహో'. ఆగష్ట్ 30వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ లోపు ఈసినిమా నుండి పాటలను, పోస్టర్లను రిలీజ్ చేస్తూ అభిమానులను కూల్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమా, అందులోనూ నాలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది.. అందుకే ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం చాలా భారీగా చేయనున్నారు.

బాలకృష్ణ కు విలన్ గా సింహా హీరోయిన్
కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆగష్ట్ 7 నుంచి బ్యాంకాక్‌లో తొలి షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లుగా వేదిక, సోనాల్ చౌహన్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ‘లెజెండ్’, ‘డిక్టేటర్’ సినిమాల్లో సోనాల్ చౌహాన్‌తో జతకట్టాడు బాలయ్య. ఇప్పుడు మూడోసారి నటించనున్నాడు. ఇదిలా ఉండగా భూమిక కూడా ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

రానా నిర్మాతగా ప్రముఖ క్రికెటర్ బయోపిక్
సెన్సేషనల్ శ్రీలంక క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నట్టు తెలిసిందే. తమిళ టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి హీరోగా ఈ బయోపిక్ ను రూపొందించనున్నారు. థార్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రంగస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇండియాతో పాటు, శ్రీలంక, ఇంగ్లాండ్‌లోనూ షూటింగ్ జరుపనున్నారట.

రష్మిక తమిళ మూవీ ఆగస్ట్ లో ప్రారంభం
బ్లాక్ బస్టర్ మూవీ కిరిక్ పార్టీ తో శాండల్ వుడ్ లో అడుగుపెట్టిన రష్మిక నటించిన అంజనీపుత్ర, చమక్ కన్నడ మూవీస్ విజయం సాధించాయి.బ్లాక్ బస్టర్ ఛలో మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన రష్మిక గీతగోవిందం మూవీ తో స్టార్ హీరోయిన్ గా మారారు. మల్టీ స్టారర్ దేవదాస్ మూవీ కమర్షియల్ గా విజయం సాధించింది. యజమాన కన్నడ మూవీ ఘనవిజయం సాధించి హీరో దర్శన్ సినీ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ తో రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ మూవీ సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది.
అంచనాలను పెంచుతున్న అశ్వమేథం
సైబర్ క్రైం నేపథ్యంలో నితిన్ దర్శకత్వంలో ధృవ కరుణాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా అశ్వమేథం. ప్రస్తుతం ఈ సినిమా అన్ని కార్యక్రమాలుపూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీ ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
అఖిల్ సరసన నాని హీరోయిన్!?
యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో... అఖిల్ అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయి గా కనిపించనున్నట్లు సమాచారం. కాగా... ఇందులో అఖిల్ కి జోడిగా 'గ్యాంగ్ లీడర్' చిత్ర కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్ ఎంపికైందని తెలిసింది. త్వరలో ప్రియాంక ఎంట్రీ పై క్లారిటీ రానుంది.

కాజల్ అగర్వాల్ ప్రయోగాత్మక మూవీ
తెలుగు, తమిళ భాషల చిత్రాలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ ఒక ప్రయోగాత్మక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్ మూవీ అ లో కాజల్ అగర్వాల్ ఒక కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ యువతి క్యారెక్టర్ లో నటించిన కాజల్ తన పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
సెన్సార్ పూర్తి చేసుకున్న `రాక్షసుడు`
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. తమిళనాట ఘనవిజయం సాధించిన ‘రాట్చసన్’(2018)కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహించగా...ఘిబ్రాన్ స్వరాలు సమకూర్చాడు.

పల్లెటూరి దొరబాబు గెటప్
ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిల్మ్స్, జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ, అనఘజంటగా , నిజ సంఘటనల ప్రేరణ తో రూపొందిన యాక్షన్ డ్రామా గుణ 369 మూవీ ఆగస్ట్ 2వ తేదీ రిలీజ్ కానుంది. అనిల్ కడియాల, తిరుమల రెడ్డి నిర్మించిన గుణ 369 మూవీ కి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. సాయికుమార్, ఆదిత్య మీనన్ ముఖ్య పాత్రలలో నటించారు.
మరోసారి మెగాస్టార్ కి జోడిగా...
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్టు 22న చిరు పుట్టినరోజు సందర్భంగా ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.

మహేష్ బాబు ‘రాజకుమారుడు’కు 20 ఏళ్ళు
తెలుగునాట ఎందరో కథానాయకులు సందడి చేసారు. వారిలో కొందరు మాత్రమే స్టార్ డం చూసారు. అలా... స్టార్ డమ్ చూసిన కథానాయకుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ది స్పెషల్ ట్రాక్ రికార్డ్. ఎందుకంటే... సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన మహేష్... అటు బాల నటుడిగానూ, ఇటు కథానాయకుడిగానూ ... రెండు విధాలా స్టార్ డమ్ చూసాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తొమ్మిది చిత్రాల్లో సందడి చేసిన మహేష్... హీరోగా పాతిక చిత్రాల మైలురాయిని చేరుకున్నాడు. అలాంటి మహేష్ బాబు... కథానాయకుడిగా తొలి అడుగులు వేసిన చిత్రం ‘రాజకుమారుడు’. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందించిన ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింతా…
మైత్రీ మూవీ మేకర్స్... మరో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్?
‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్... త్వరలో మరో మూడు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించనుందని సమాచారం.

తరుణ్ భాస్కర్ కు హీరోయిన్ ఫిక్స్
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలుసు. ఈసినిమాతో హీరోగా వచ్చి ఇప్పుడు ఫుల్ క్రేజ్ తో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి తరుణ్ భాస్కర్ హీరోగా..విజయ్ నిర్మాతగా. కింగ్ ఆఫ్ హిల్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు విజయ్.

సాహో నుండి వచ్చేస్తున్న 'ఏ చోట నువ్వున్నా'
సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో 'సాహో' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా నెలరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అప్పుడే మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి టీజర్ ను.. సయ్యా సైకో అనే పాటను రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరో పాటను విడుదల చేశారు. ఎన్ని సోనా అనే పాటను రేపు విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం నాలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఈ పాటకు గురు రంధవా మ్యూజిక్ అందించాడు.

అత్తా కోడళ్లుగా స్నేహ, మెహ్రీన్
ఎఫ్2 సినిమాతో ఈ ఏడాది ప్రారంభంలోనే మంచి హిట్ ను కొట్టింది మెహ్రీన్. ఇక ఈ సినిమాతో అమ్మడికి తమిళ్ నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయి. దీనిలో భాగంగానే తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో నటించే అవకాశం దక్కింది. పటాస్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో ధనుష్, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈరోజు ధనుష్ పుట్టినరోజు కావడంతో ధనుష్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

పరిశ్రమలో అందరూ పదవీ వ్యామోహాలకు అతీతంగా ఆలోచించాలి
మొన్న జరిగిన తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ఎన్నికలలో సంఖ్యా బలం దృష్ట్యా ప్రొడ్యూసర్స్ సెక్టార్ నుండి "మన ప్యానెల్" ఘన విజయాన్ని సాధించినప్పటికీ అందులో పేరున్న అగ్ర నిర్మాతలు ఎవరూ లేకపోవడం చర్చనీయాంశం అవుతుంది. "మన ప్యానెల్" అభ్యర్థులలో ఎవరో కొద్దిమంది తప్ప యాక్టివ్ ప్రొడ్యూసర్స్ లేరు. ఏ రోజుకారోజు అన్నట్లుగా మారి పోతున్న చిత్ర నిర్మాణ ధోరణుల పట్ల, సమస్యల పట్ల అవగాహన లేని నిర్మాతలు అధిక సంఖ్యలో ఉండటం, రెగ్యులర్ గా చిత్రాలు నిర్మించే అగ్ర నిర్మాతలు దాదాపుగా లేకపోవటంతో ఈ ఎన్నికల ఫలితాల పట్ల కొందరు ప్రముఖులు, పరిశీలకులు పెదవి విరుస్తున్నారు.రెగ్యులర్ గా చిత్రాలు నిర్మించే అగ్రనిర్మాతలు చాలామంది ఈ ఫలితాల…

ప్రస్థానం టీజర్ రిలీజ్
దేవకట్టా దర్శకత్వంలో సాయి కుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రస్థానం విమర్శల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇప్పుడు ఇదే సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో దర్శకత్వం వహించిన దేవకట్టానే హిందీలో కూడా తానే దర్శకత్వం వహిస్తున్నాడు. టైటిల్ కూడా ప్రస్థానం అనే ఉంచారు. ఈ సినిమాలో తెలుగులో సాయికుమార్ చేసిన పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్న సంగతి కూడా విదితమే.

కీలక పదవి దక్కించుకున్న అలీ
రాజకీయాలకు, సినీ పరిశ్రమకు అవినాభావసంబంధం ఉంటుందన్న సంగతి మనం ఎప్పటినుండో చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది సినీ పరిశ్రమలో చక్రం తిప్పిన ప్రముఖులు.. రాజకీయాల్లో కూడా మార్కు చూపించారు. అలా ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో కూడా సేవలు అందించడానికి మన తెలుగు పరిశ్రమనుండి ఇప్పటికీ ఎంతో మంది సినీ పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. అందులో టాలీవుడ్ టాప్ కమెడియన్ అలీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. పృథ్విరాజ్

గాసిప్స్ పై స్పందన
సక్సెస్ ఫుల్ మూవీ అ ఆ తో టాలీవుడ్ కు ఎంటరయిన అనుపమ పరమేశ్వరన్ నటించిన ప్రేమమ్, శతమానం భవతి మూవీస్ ఘనవిజయం సాధించాయి. తన అందం, అభినయం తో అనుపమ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు, హలో గురు ప్రేమకోసమే వంటి సినిమాలలో నటించిన అనుపమ లేటెస్ట్ మూవీ రాక్షసుడు ఆగస్ట్ 2 వ తేదీ రిలీజ్ కానుంది. గత కొన్ని రోజులుగా ఇండియన్ క్రికెటర్ జస్ ప్రీత్ బుమ్రా తో రిలేషన్ షిప్ లో అనుపమ ఉన్నట్టుగా పుకార్లు షికారు చేశాయి.