చిరు హీరోగా ‘దిల్’ రాజు సినిమా!?

Dil Raju To Produce Chiranjeevi Movie,2019 Latest Telugu Movie News,Chiru and Dil Raju to Work Together, chiranjeevi to work with Dil Raju, Chiranjeevi 153rd movie with Dil Raju, Chiranjeevi Next With Dil Raju, Mega Star Chiranjeevi Latest Movie News, chiranjeevi and Dil Raju to join hands For His Next, Dil Raju to produce film with chiranjeevi, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Dil Raju To Produce Chiranjeevi Movie

మెగా కాంపౌండ్ హీరోలకి కలిసొచ్చిన నిర్మాతలలో ‘దిల్’ రాజు ఒకరు. రామ్ చరణ్ (ఎవడు), అల్లు అర్జున్ (ఆర్య, పరుగు), వరుణ్ తేజ్( ఫిదా, ఎఫ్ 2), సాయి ధరమ్ తేజ్ (సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం)… ఇలా మెగా క్యాంప్ హీరోలతో రాజు నిర్మించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో… మెగాస్టార్ చిరంజీవితోనూ రాజు ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ మేరకు చిరు, రాజు మధ్య చర్చలు జరిగాయని… చిరు కూడా రాజు సంస్థలో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని టాలీవుడ్ టాక్. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

చిరంజీవి 151 వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ అక్టోబర్ లో విడుదల కానుండగా… ఈ లోపు కొరటాల శివ దర్శకత్వంలో 152 వ చిత్రం ప్రారంభం కానుంది. అది విడుదల అయ్యేలోపు రాజు నిర్మించే సినిమా ప్రారంభం కావచ్చు. మరి… మెగా కాంపౌండ్ యంగ్ హీరోలకు అచ్చొచ్చిన ‘దిల్’ రాజు… మెగాస్టార్ తోను ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=vgvghDIl5nc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.