చైతూ… ముచ్చ‌ట‌గా మూడోసారి

2019 Latest Telugu Movie News, Will The Same Sentiment Work For Naga Chaitanya,Naga Chaitanya Same Sentiment to Continue For This Year, Naga Chaitanya With Same Sentiment, Naga Chaitanya Latest Movie Updates, Naga Chaitanya Upcoming movie Projects, Naga Chaitanya With 2 More Projects, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Will The Same Sentiment Work For Naga Chaitanya?

కథానాయకుడిగా యువసామ్రాట్ నాగచైతన్యది పదేళ్ల ప్రస్థానం. ఈ ప్రయాణంలో ఏడాదికి ఒకటి లేదా రెండు చిత్రాలకే పరిమితమైన సందర్భాలే ఎక్కువ. అయితే… 2011, 2014 సంవత్సరాల్లో మాత్రం చైతు మూడేసి సినిమాలతో సందడి చేశాడు. 2011లో ‘100% లవ్, దడ, బెజవాడ’ చిత్రాలతో పలకరించిన చైతు… 2014లో ‘మనం, ఆటోనగర్ సూర్య, ఒక లైలా కోసం’ తో అలరించాడు. కట్ చేస్తే… ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ముచ్చటగా మూడోసారి ఒకే క్యాలెండర్ ఇయర్ లో మూడేసి సినిమాలతో పలకరించబోతున్నాడు నాగ చైతన్య.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ఈ ఏడాది వేసవిలో ‘మజిలీ’తో ఆకట్టుకున్న నాగ చైతన్య… దసరాకి తన మేనమామ విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో ‘వెంకీ మామ’తో సందడి చేయనున్నాడు. అంతేకాదు… డిసెంబరులో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందనున్న సినిమాతో పలకరించబోతున్నాడు.

మరి… ముచ్చటగా మూడోసారి ఒకే క్యాలెండర్ ఇయర్ లో మూడేసి సినిమాలతో రాబోతున్న చైతుకి… ఈసారైనా హ్యాట్రిక్ విజయాలు దక్కుతాయేమో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=eU2vwUoPOAQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 19 =