ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గా నారాయణదాస్ కె నారంగ్

2019 Latest Telugu Movie News, Film Chamber of Commerce President Narayandas K Narang, Narayandas K Narang Appointed as President of Film Chamber of Commerce, Narayandas K Narang elected TFCC President, Narayandas K Narang To Take Charge As TFCC President, Narayandas won Film Chamber of Commerce Elections, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

గత కొన్ని రోజులుగా తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఆ క్రమంలో ఈ సారి జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు కూడా సర్వత్రా ఆసక్తిని పెంచాయి. ఈ ఎన్నికల్లో ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి బరిలోకి దిగిన ఏసియన్ సినిమాస్ అధినేత నారాయణదాస్ కె నారంగ్ గారు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికపై పరిశ్రమ నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు సినిమా పరిశ్రమలో ఫైనాన్సియర్స్ గా సుస్థిర స్థానం సంపాదించుకున్న నారాయణదాస్ నారంగ్ గారు 600కు పైగా సినిమాలకు ఫైనాన్సర్ గా ఉన్నారు. అలాగే వందలాది సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ ఛైన్ ఆఫ్ థియేటర్స్ అయిన ఏసియన్ సినిమాస్ ను విజయవంతంగా నడిపిస్తూ.. పరిశ్రమలో తనదైన ముద్రను వేశారు. ఇప్పటి వరకూ ఫైనాన్స్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో దూసుకుపోతోన్న ఏసియన్ సినిమాస్ రీసెంట్ గా నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టింది.

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రంతో ఏసియన్ సినిమాస్ చిత్ర నిర్మాణం మొదలుపెట్టింది. మొత్తంగా చిత్ర పరిశ్రమతో సుదీర్ఘ అనుబంధం ఉన్న నారాయణదాస్ నారంగ్ గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆయనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు అందరూ. అలాగే ఆయన ముందు ముందు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నారు..

[subscribe]

[youtube_video videoid=l1DU3IBnOWU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 10 =