‘ఆర్ ఎక్స్ 100’తో టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు చైతన్ భరద్వాజ్. అంతేకాదు… మొదటి సినిమాతోనే తన స్వరాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కాగా… తాజాగా ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ నటించిన ‘గుణ 369’తో పాటు… ‘కింగ్’ నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘మన్మథుడు 2’కి స్వరాలు సమకూర్చాడు చైతన్. ఈ రెండు సినిమాలు కూడా వారం రోజుల గ్యాప్ లో థియేటర్లలోకి రానున్నాయి. ఇదిలా ఉంటే… ఇంతవరకు చైతన్ సంగీతం అందించిన సినిమాల తాలూకు టైటిల్స్‌ను నిశితంగా పరిశీలిస్తే… ఓ ఆసక్తికరమైన విషయం స్పష్టమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేమిటంటే… ‘ఆర్ ఎక్స్ 100’, ‘ 7’, ‘గుణ 369’, ‘మన్మథుడు 2’… ఇలా చైతన్ సంగీతం అందించిన తొలి నాలుగు సినిమాలు కూడా నెంబర్ బేస్డ్ టైటిల్స్ తో రూపొందాయి. ఇప్పటికే… ‘ఆర్ ఎక్స్ 100’తో కుర్రకారుని ఉర్రూతలూగించిన చైతన్… ‘గుణ 369’ ‘మన్మథుడు 2’ తోనూ మ్యూజికల్ గా మెస్మరైజ్ చేస్తే… మున్ముందు ఈ నెంబర్ బేస్డ్ టైటిల్స్ అతనికి సెంటిమెంట్‌గా మారే అవకాశం లేకపోలేదు.
కాగా… ‘గుణ 369’ ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుండగా… ‘మన్మథుడు 2’ ఆగస్టు 9న విడుదల కానుంది.
[subscribe]
[youtube_video videoid=QfXMVEDmCm4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























