
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 103


ఆగిపోయిన తమిళ్ అర్జున్ రెడ్డి - మళ్లీ రీ షూట్!

యాత్ర సినిమా ప్రత్యేకతలు

షూటింగ్ మొదలుపెట్టిన తెనాలి రామకృష్ణ బీఏబీఎల్

మహర్షి డబ్బింగ్ ప్రారంభం

అల్లు అర్జున్ తండ్రిగా పవన్ కళ్యాణ్ తాతయ్య?

ఆకాష్ పూరీ కొత్త సినిమా అప్ డేట్

రెండు కోణాల్లో సాగే పాత్రలో నాగచైతన్య

కన్నడ మూవీ KGF చాప్టర్ -2 లో ?

ఎఫ్2 25 రోజుల కలెక్షన్స్

ముందే వస్తున్న అల్లు అర్జున్?

మరో డిఫరెంట్ రోల్‌లో మహేష్ బాబు?

స్పెషల్ సెట్‌లో `సాహో` ఫైట్స్

లక్కీ హీరోయిన్ రష్మిక మందన్న

4 లెటర్స్ మూవీ ట్రైలర్ రిలీజ్

మా కిల్ బిల్ పాండే ఈజ్ బ్యాక్
టాలీవుడ్ ప్రముఖ టాప్ కమెడియన్ బ్రహ్మానందంకు ఇటీవల హార్ట్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యుత్తమమైన ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్’లో గత నెల 14న ఆయనకు గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. దీంతో గత కొద్దికాలంగా ఆయన ఆస్పత్రిలోనే ఉండగా...ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.

ఆగిపోయిన తమిళ్ అర్జున్ రెడ్డి - మళ్లీ రీ షూట్!
విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాతో విజయ్ దేవరకొండకు ఒక్కసారిగా యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు.. స్టార్ డమ్ కూడా పెరిగిపోయింది. ఇక ఒక భాషలో హిట్టయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం ఇప్పుడొక సంప్రదాయంగా కూడా మారిపోయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాను కూడా హిందీలో కబీర్ సింగ్ పేరుతో షాహిద్ కపూర్ హీరోగా.. సందీప్ రెడ్డి దర్శకత్వంలో రీమేక్ చేస్తుండగా... తమిళ్ లో విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా ప్రముఖ దర్శకుడు బాల దర్శకత్వంలో వర్మ అనే పేరుతో సినిమా తెరకెక్కుతోంది.

హీరో హీరోయిన్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
అడ్డా, ఓటర్ చిత్రాల డైరెక్టర్ జి.ఎస్. కార్తీక్ దర్శకత్వంలో నవీన్ చంద్ర, గాయత్రి సురేష్ హీరో హీరోయిన్లుగా కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. హీరో హీరోయిన్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా గత కొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

యాత్ర సినిమా ప్రత్యేకతలు
మహ. వి రాఘవ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. వైఎస్ రాజకీయ జీవితంలో కీలక ఘట్టం ఏదైనా ఉందంటే అది పాదయాత్ర అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా విషయంలో కూడా పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా రాజకీయ నేపథ్యంలోనే ఉండబోతుందన్న అనుమానాలు తెరపైకి వచ్చాయి. అంతేనా.. త్వరలో ఎన్నికలు రానున్నాయి కదా అందుకే ఈ నేపథ్యంలో ఇప్పుడు కావాలనే ఈ సినిమాను తెరకెక్కించారని అన్నారు. ఎన్నికల స్టంట్, జగన్ కు సపోర్ట్ గా తీస్తున్నారు అన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే డైరెక్టర్ మాత్రం ఇది ఏ రాజకీయ…

షూటింగ్ మొదలుపెట్టిన తెనాలి రామకృష్ణ బీఏబీఎల్
కామెడీ చిత్రాల దర్శకుడు జీ నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజే మొదలైనట్టు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ ను 'కర్నూల్'లో ప్లాన్ చేశారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారట. కొన్ని రోజుల పాటు అక్కడే షూటింగు జరగనుందట.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ
స్వరూప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ జంటగా తెరకెక్కుతున్న సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఇటీవలే ఈ సినిమా పోస్టర్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా..చాలా డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకున్నాయి. వినోదాత్మకంగా ఉన్న నవీన్ పొలిశెట్టి లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

మహర్షి డబ్బింగ్ ప్రారంభం
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా మహర్షి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. గత కొద్దికాలంగా షెడ్యూల్ వారీగా షూటింగ్ జరుపుకుంటుండగా.. ఇప్పుడు షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. పొల్చాచ్చి, తమిళనాడులో ఇటీవలే షూటింగ్ ముగించుకోగా.. నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. దాని తరువాత నెక్ట్స్ షెడ్యూల్ ను అబుదాబిలో చేయనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అబుదాబి షెడ్యూల్ తో.. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తవుతుందని సమాచారం.

అల్లు అర్జున్ తండ్రిగా పవన్ కళ్యాణ్ తాతయ్య?
`జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

ఆకాష్ పూరీ కొత్త సినిమా అప్ డేట్
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఇస్మార్ శంకర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరోపక్క తనయుడు ఆకాష్ సినిమాను కూాడా పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో పూరీ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా సినిమాకు మంచి టాక్ అయితే వచ్చిందని కానీ... అశించినంత విజయం మాత్రం దక్కించుకోలేక పోయింది.

మూడేళ్ళ పాటు సమ్మర్‌నే టార్గెట్ చేసుకున్న మహేష్ బాబు
`పోకిరి`, `భరత్ అనే నేను`... సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ప్రత్యేకంగా నిలచిన చిత్రాలు. ఈ రెండు సినిమాలకి సంబంధించి ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే... ఈ బ్లాక్‌బస్టర్ హిట్స్ సమ్మర్ సీజన్‌లోనే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ముఖ్యంగా... ఏప్రిల్ నెలతో మహేష్‌కి మంచి అనుబంధమే ఉంది. ఆ నెలలోనే `పోకిరి`, `భరత్ అనే నేను` విడుదలై ఘనవిజయం సాధించాయి.

రెండు కోణాల్లో సాగే పాత్రలో నాగచైతన్య
`ఏమాయ చేసావె`, `మనం`, `ఆటోనగర్ సూర్య` చిత్రాల్లో జంటగా నటించి కనువిందు చేసిన నాగచైతన్య, సమంత... పెళ్ళి తరువాత నటిస్తున్న తొలి చిత్రం `మజిలీ`. `నిన్ను కోరి` వంటి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌ని అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భార్యభర్తల బంధం, వారి భావోద్వేగాలు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా... రెండు కోణాల్లో సాగే పాత్రలో నాగచైతన్య కనిపిస్తున్నాడు.

కన్నడ మూవీ KGF చాప్టర్ -2 లో ?
ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో యష్ హీరోగా రూపొందిన మాస్, యాక్షన్ థ్రిల్లర్ KGF చాప్టర్ 1 కన్నడ మూవీ 2018 సంవత్సరం డిసెంబర్ లో రిలీజయి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కన్నడంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ సాధించాయి. కన్నడ భాష లో 240 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి అత్యధిక వసూళ్ళు సాధించిన శాండల్ వుడ్ మూవీగా KGF చాప్టర్ 1 రికార్డ్ క్రియేట్ చేసింది.

ఎఫ్2 25 రోజుల కలెక్షన్స్
తాజాగా బాక్సాఫీసు వద్ద 25 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ మరి ఎక్కడెక్కడ ఎంత షేర్ రాబట్టిందో చూద్దాం...

మహాశివరాత్రికి `మహానాయకుడు`
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ `యన్.టి.ఆర్`. రెండు భాగాలుగా ఈ బయోపిక్ తెరకెక్కగా... తొలి భాగం `యన్.టి.ఆర్. కథానాయకుడు` పేరుతోనూ, మలి భాగం `యన్.టి.ఆర్. మహానాయకుడు` పేరుతోనూ రూపొందింది. కాగా... యన్టీఆర్ నటప్రస్థానం నేపథ్యంలో రూపొందిన `యన్.టి.ఆర్. కథానాయకుడు` సంక్రాంతి కానుకగా విడుదలైంది. సర్వత్రా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం... కొన్ని కారణాల వల్ల ఆ టాక్‌ని వసూళ్ళుగా మలుచుకోలేకపోయింది.

`ఆర్ ఎక్స్ 100` దర్శకుడితో బెల్లంకొండ సాయిశ్రీనివాస్?
`ఆర్ ఎక్స్ 100`తో సంచలన విజయం అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే కేపబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అజయ్... సెకండ్ అవుటింగ్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. లేటెస్ట్ ఇన్‌ఫర్‌మేషన్ ప్రకారం... తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో భూపతి ప్లాన్ చేశాడని టాలీవుడ్ టాక్. అంతేకాదు... ఫస్ట్ ఫిల్మ్ లాగే ఈ ప్రాజెక్ట్ ని కూడా ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, కాన్‌ప్లిక్ట్‌తో డిజైన్ చేశాడని తెలుస్తోంది. అలాగే తొలి చిత్రం మాదిరిగానే... రెండో సినిమాలోనూ కథానాయిక పాత్రకి ఎంతో ప్రాధాన్యం ఉంటుందని... ఈ రోల్ కోసం టాలెంటెడ్ బ్యూటీ సమంతని…

ముందే వస్తున్న అల్లు అర్జున్?
గత ఏడాది వేసవికి విడుదలైన `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`తో అభిమానులను అలరించాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. దాదాపు పది నెలల విరామం తరువాత... తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ ఈ సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా... మార్చిలో పట్టాలెక్కనుందని సమాచారం.

మరో డిఫరెంట్ రోల్‌లో మహేష్ బాబు?
వైవిధ్యభరితమైన పాత్రల్లో కనిపించడానికి ఉత్సాహం చూపించే కథానాయకుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుంటారు. గత చిత్రం `భరత్ అనే నేను`లో యువ ముఖ్యమంత్రి పాత్రలో అలరించిన మహేష్... తాజా చిత్రం `మహర్షి`లో మూడు విభిన్న ఛాయలున్న పాత్రలో కనిపించనున్నాడు. కాలేజ్ స్టూడెంట్‌గా, సాఫ్ట్‌వేర్ కంపెనీ అధినేతగా, ఆధునిక రైతుగా ఆయన దర్శనమివ్వనున్నాడు. అంతేకాదు... త్వరలోనే పట్టాలెక్కనున్న తన 26వ చిత్రంలోనూ ఇదివరకు చేయని ఓ పాత్రని చేయబోతున్నాడట ఈ టాలెంటెడ్ హీరో.

స్పెషల్ సెట్‌లో `సాహో` ఫైట్స్
`బాహుబలి` సిరీస్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు ప్రభాస్ ఓ నేషనల్ స్టార్. అందుకే... అప్‌కమింగ్ ప్రాజెక్ట్ `సాహో`ని ఆ స్థాయిలోనే చేపట్టాడు ఈ కటౌట్ ప్లస్ కంటెంట్ ఉన్న స్టార్ హీరో. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్-ఇండియా అప్పీల్‌తో తెరకెక్కుతుండగా... ప్రముఖ బాలీవుడ్ నటీనటులతో పాటు దక్షిణాది నటులు కూడా ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో... ఈ సినిమాకు సంబంధించి ఓ చిన్న అప్‌డేట్ వచ్చినా నేషనల్ వైడ్ అటెన్షన్ వస్తోంది.

లక్కీ హీరోయిన్ రష్మిక మందన్న
బ్లాక్ బస్టర్ మూవీ ఛలో తో టాలీవుడ్ కు ఎంటరయిన రష్మిక మందన్న తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో విజయ్ దేవరకొండ తో జంటగా నటించిన సూపర్ డూపర్ హిట్ గీత గోవిందం మూవీతో స్టార్ డమ్ అందుకున్నారు. ఆ మూవీ తో రష్మిక లక్కీ హీరోయిన్ గా మారి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిలిచారు.

4 లెటర్స్ మూవీ ట్రైలర్ రిలీజ్
ఆర్.రఘురాజ్ దర్శకత్వంలో.. ఈశ్వర్, తుయా చక్రబోర్తి, అంకిత మహారాణా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 4 లెటర్స్ (కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే). ప్రస్తుతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకొని ఈ నెల 22 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా టీజర్ ను ఇటీవలే విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.