`ఆర్ ఎక్స్ 100`తో సంచలన విజయం అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే కేపబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అజయ్… సెకండ్ అవుటింగ్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. లేటెస్ట్ ఇన్‌ఫర్‌మేషన్ ప్రకారం… తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో భూపతి ప్లాన్ చేశాడని టాలీవుడ్ టాక్. అంతేకాదు… ఫస్ట్ ఫిల్మ్ లాగే ఈ ప్రాజెక్ట్ ని కూడా ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, కాన్‌ప్లిక్ట్‌తో డిజైన్ చేశాడని తెలుస్తోంది. అలాగే తొలి చిత్రం మాదిరిగానే… రెండో సినిమాలోనూ కథానాయిక పాత్రకి ఎంతో ప్రాధాన్యం ఉంటుందని… ఈ రోల్ కోసం టాలెంటెడ్ బ్యూటీ సమంతని ఫీమేల్ లీడ్‌గా అనుకుంటున్నట్లుగా వినిపిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే… బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఫస్ట్ అవుటింగ్ `అల్లుడు శీను`లో సమంత హీరోయిన్‌గా నటించింది. మళ్ళీ ఐదేళ్ళ తరువాత వీరిద్దరి కలయికలో సినిమా రానుండడం బజ్ క్రియేట్ చేస్తోంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మరో వారం రోజుల్లో వెల్లడయ్యే అవకాశముంది. `ఆర్ ఎక్స్ 100` తరహాలోనే మరో సెన్సేషనల్ హిట్‌ని అజయ్ అందుకోవాలని ఆశిద్దాం.
[youtube_video videoid=EQXx18Pd6hA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: