
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 102


పూరి కనెక్ట్స్ లో రెండవ మూవీ

యూవీ క్రియేషన్స్‌లో నాగచైతన్య?

రైటర్ అవతారమెత్తుతున్న నేచురల్ స్టార్?

`మన్మథుడు 2`లో అక్కినేని అమల?

ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు

అప్పుడు కీర్తి సురేష్ ఇప్పుడు నయనతార

కూతుర్ని దొంగ ఫెలో అంటున్న బన్నీ - ఫన్నీ సంభాషణ

వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న యువనటుడు

`ఆర్ ఆర్ ఆర్` కోసం 1000 ఫైటర్స్?

పైరసీ పై కేంద్ర నిర్ణయం - జైలు శిక్ష, జరిమానా

హీరో స్వంత బ్యానర్ లో హీరోగా దర్శకుడు

అనుపమ ఖాతాలో అరుదైన రికార్డు

మహేష్... ఒకే ఏడాదిలో రెండు మైల్ స్టోన్స్

కొత్త మూవీ షూటింగ్ కు రెడీ

#ప్రభాస్ 20 మూవీ పై ప్రశంసలు

నాని సినిమాలో అదా శర్మ ప్రత్యేక గీతం?
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `జెర్సీ`. ఇందులో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు నాని. ఒకటేమో యంగ్ రంజీ ప్లేయర్ రోల్ కాగా... మరొకటి ఆ క్యారెక్టర్‌కు తండ్రి పాత్ర. రెండో పాత్రలోనే... మధ్య వయస్కుడైన క్రికెటర్ అర్జున్ గానూ కనిపించనున్నాడట నాని. అంతేకాదు... ట్రాజిక్ ఎండింగ్‌తో ఈ సినిమా ఉంటుందని టాలీవుడ్ టాక్.

పూరి కనెక్ట్స్ లో రెండవ మూవీ
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్, ఛార్మీ )నిర్మాణ సారధ్యం లో స్వీయ దర్శకత్వంలో పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ పూరి ని టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేస్తూ మెహబూబా మూవీ రూపొందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పూరి కనెక్ట్స్ తమ తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేసింది.

యూవీ క్రియేషన్స్‌లో నాగచైతన్య?
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న యువ కథానాయకుల్లో అక్కినేని నాగచైతన్య ఒకరు. తన శ్రీమతి సమంతతో పెళ్ళయ్యాక నటిస్తున్న `మజిలీ` సినిమా తుది దశలో ఉండగా... తన మేనమామ విక్టరీ వెంకటేష్‌తో కలసి నటించనున్న `వెంకీ మామ` త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కి ముస్తాబవుతోంది. అలాగే తన తండ్రి కింగ్ నాగార్జున కాంబినేషన్‌లోనూ `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు చైతూ.

రైటర్ అవతారమెత్తుతున్న నేచురల్ స్టార్?
తన సహజ నటనతో యువతరానికి, కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన యువ కథానాయకుడు నాని. ఆ మధ్యంతా పక్కింటి అబ్బాయి తరహా పాత్రల్లో కనిపించిన నాని... ఈ మధ్య తన శైలికి భిన్నంగా సాగే పాత్రలను ఎంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే... గత ఏడాది `దేవదాస్`లో డాక్టర్‌గా కనిపించి అలరించిన ఈ నేచురల్ స్టార్... అప్‌కమింగ్ ప్రాజెక్ట్ `జెర్సీ`లో మధ్యవయస్కుడైన క్రికెటర్ అర్జున్ పాత్రలో దర్శనమివ్వనున్నాడు. ఇక టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లోనూ మరో కొత్త తరహా పాత్రలో కనిపిస్తాడట ఈ యంగ్ హీరో.

`మన్మథుడు 2`లో అక్కినేని అమల?
అక్కినేని నాగార్జున, అక్కినేని అమల... రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ సూపర్ హిట్ జోడీ. పెళ్ళయ్యాక సినిమాలకు దూరమైన అమల... ఆ మధ్య `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్` (2012) చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత అక్కినేని కుటుంబమంతా కలసి నటించిన `మనం` (2014)లో అతిథి పాత్ర పోషించారు. అనంతరం `హమారి అధూరి కహానీ` (2015), `కార్వాన్` (2018) వంటి హిందీ చిత్రాల్లోనూ... `కేరాఫ్ సైరా భాను` (2017) అనే మలయాళ చిత్రంలోనూ అమల కనిపించారు. కాగా... ఐదేళ్ళ తరువాత తెలుగు తెరపై దర్శనమివ్వనున్నారట అమల.

ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా మహి.వి రాఘవ్ దర్శకత్వంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. నిన్న విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ్ ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశాడు.

అప్పుడు కీర్తి సురేష్ ఇప్పుడు నయనతార
ఈ మధ్య షూటింగ్ లు పూర్తయిన వెంటనే గిఫ్ట్స్ ఇవ్వడం ఓ సాంప్రదాయంగా మారిపోయింది. ఒకప్పుడు అలనాటి మహానటి సావిత్రి ఇలా చేస్తుండేవారు. తాను నటిస్తున్న టైమ్ లో చిత్ర యూనిట్ ఇలా గోల్డ్ కాయిన్స్ ఇస్తుండేవారు. ఆ తరువాత ఆమె బయోపిక్ లో నటించిన నేపథ్యంలో కీర్తి సురేష్ మహానటి సినిమా షూటింగ్ పూర్తయినప్పుడు.. సావిత్రి సాంప్రదాయన్నే పాటించింది. అందరికీ గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చింది. పందెంకోడి 2 చిత్ర షూటింగ్ పూర్తయినప్పుడు కూడా యూనిట్ కు గోల్డ్ కాయిన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చింది.

కూతుర్ని దొంగ ఫెలో అంటున్న బన్నీ - ఫన్నీ సంభాషణ
ప్రస్తుతం అల్లు అర్జున్ ఫుల్ రెస్టింగ్ మోడ్ లో ఉన్నాడు. నా పేరు సూర్యు నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్.. త్రివిక్రమ్ తో తన కొత్త సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా ఈ ఖాళీ టైంలో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో టైం గడుపుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే తన కూతురు అర్హతో కలిసి అల్లు అర్జున్ జరిపిన ఓ క్యూట్ కన్వర్జేషన్ కు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.


వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న యువనటుడు
తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు యువ నటుడు చరణ్ దీప్. ‘పటాస్’ సినిమాతో నెగటివ్ షేడ్స్ లో నటించిన చరణ్ దీప్ ఆ తరువాత ‘లోఫర్’ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించాడు. ఈ సినిమాలో తన పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. అంతేకాదు.. ‘బాహుబలి’లో కాలకేయ తమ్ముడిగానూ, ‘పీఎస్వీ గరుడవేగ’లో పోలీస్ పాత్రలో కనిపించి తన నటనతో మళ్లీ ఆకట్టుకున్నాడు. కల్కీ సినిమాలో కూడా చరణ్ దీప్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. గరుడ వేగలో పాజిటివ్ పాత్రలో నటించగా.. కల్కీ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు.

కీర్తి శిఖరంపై నిర్మించిన అక్షర సౌధం "ఎన్టీఆర్ ఏ బయోపిక్"
ఒక శక్తిగా, వ్యవస్థగా ఎదిగి ప్రజల మనసుల్లో ఒక ప్రగాఢమైన ముద్రను వేసిన వ్యక్తి చరిత్రను అక్షరబద్ధం చేసినప్పుడు దాన్ని చదువుతున్న పాఠకుడుకి ఆ వ్యక్తి యొక్క మహోన్నత వ్యక్తిత్వము, కార్యదక్షత, నిష్పాక్షిక వ్యవహార శైలి కళ్ళ ముందు సాక్షాత్కరించాలి. అలాంటి గొప్ప ప్రయత్నమే “ఎన్టీఆర్ ఏ బయోగ్రఫీ” అనే పుస్తకం.

`ఆర్ ఆర్ ఆర్` కోసం 1000 ఫైటర్స్?
మాసివ్ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న `ఆర్ ఆర్ ఆర్`... రోజు రోజుకి అంచనాలు పెంచేస్తోంది. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం కావడం... `అపజయమెరుగని దర్శకుడు` రాజమౌళి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడం వంటి అంశాలు ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ నాటి నుంచే సూపర్ బజ్ పుట్టిస్తే... నిర్మాణ దశలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తూ ఈ చిత్రంపై ఉన్న క్రేజ్‌ని `స్కై లెవల్`కు తీసుకు వెళుతున్నాయి.

పైరసీ పై కేంద్ర నిర్ణయం - జైలు శిక్ష, జరిమానా
చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఏ సినిమా అయినా కానీ ఈ మధ్య పైరసీ అవ్వడం చాలా ఈజీ అయిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే పైరసీరాయుళ్లు మాత్రం విడుదలైన కొద్ది క్షణాలకే సినిమాను సైట్లలో పెట్టేస్తున్నారు. ఈమధ్య కొత్తగా బెదిరించడం కూడా నేర్చుకున్నారు. 2.0 సినిమాను ముందే పైరసీ చేసి సైట్లలో పెడతామని బెదిరించిన దాఖలాలు కూడా చూశాము. అలా చలనచిత్ర రంగానికి పెద్ద సమస్యగా మారింది పైరసీ భూతం.

హీరో స్వంత బ్యానర్ లో హీరోగా దర్శకుడు
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన పెళ్ళిచూపులు మూవీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుంది కానీ తరుణ్ భాస్కర్ హీరోగా, విజయ్ దేవరకొండ నిర్మాతగా ఒక మూవీ రూపొందనుంది. తరుణ్ భాస్కర్ సక్సెస్ ఫుల్ మూవీస్ మహానటి, సమ్మోహనం లలో అతిథి పాత్రలలో నటించారు. ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ హీరోగా మారుతున్నారు.

ప్రభాస్ `మిర్చి`కి ఆరేళ్ళు
`కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్`... ఈ డైలాగ్ థియేటర్లలో తొలిసారిగా వినిపించి ఈ రోజుకి ఆరేళ్ళు పూర్తవుతోంది. కరెక్ట్‌గా చెప్పాలంటే... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ని మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `మిర్చి` విడుదలై ఆరేళ్ళు అవుతోంది. అలాగే... వరుస విజయాలతో దూసుకుపోతున్న రైటర్ కమ్ డైరెక్టర్ కొరటాల శివ తొలిసారిగా మెగాఫోన్ పట్టిన సినిమా రిలీజై ఆరు వసంతాలు. పేరుకి యాక్షన్ ఎంటర్‌టైనర్ అయినా... కుటుంబ బంధాలకు, మానవ విలువలకు ఎంతో ప్రాధాన్యమిచ్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు కొరటాల. ప్రభాస్ కెరీర్‌లో ఎంతో ప్రత్యేకంగా…

అనుపమ ఖాతాలో అరుదైన రికార్డు
అనుపమ పరమేశ్వరన్... చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా ఉండే రూపం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఆ రూపంతోనే దక్షిణాది ప్రేక్షకుల మనసు దోచిన ఈ కేరళ కుట్టి... తాజాగా తన ఖాతాలో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటే... దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటించడమే కాకుండా ఆ యా భాషల్లో మొదటి సినిమాలతోనే మంచి విజయాలను అందుకోవడం.

మహేష్... ఒకే ఏడాదిలో రెండు మైల్ స్టోన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు... తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. సిల్వర్ స్క్రీన్ పైనే కాదు... యాడ్ వరల్డ్‌లోనూ స్కై ఈజ్ లిమిట్ అన్నట్లుగా దూసుకుపోతున్నాడీ ప్రిన్స్. అలాంటి మహేష్‌కి... 2019 కెరీర్ పరంగా ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే... ఒకే సంవత్సరంలో కెరీర్ పరంగా రెండు మైలురాళ్ళకు చేరుకుంటున్నాడీ తెలుగు తెర రాజకుమారుడు.


కొత్త మూవీ షూటింగ్ కు రెడీ
తెలుగు, తమిళ భాషలలో అగ్ర తారగా వెలుగొందుతున్న అనుష్క నటించిన భాగమతి మూవీ 2018 జనవరిలో రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సూపర్ హిట్ మూవీ తరువాత అనుష్క ఏ మూవీ లోను నటించలేదు. ఇప్పుడు ఒక కొత్త మూవీ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

#ప్రభాస్ 20 మూవీ పై ప్రశంసలు
యు వి క్రియేషన్స్, గోపికృష్ణా మూవీస్ బ్యానర్స్ పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అందాల తార పూజా హెగ్డే జంటగా హిట్ మూవీ జిల్ దర్శకుడు KK రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో #ప్రభాస్ 20 మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ లో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హీరో ప్రభాస్, సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో స్టైలిష్ గా రూపొందుతున్న సాహో మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.