గత ఏడాది వేసవికి విడుదలైన `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`తో అభిమానులను అలరించాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. దాదాపు పది నెలల విరామం తరువాత… తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ ఈ సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా… మార్చిలో పట్టాలెక్కనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని జెట్ స్పీడ్‌తో కంప్లీట్ చేసే దిశగా యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇదివరకు… ఈ సినిమాని దసరా సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు కథనాలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం… సెప్టెంబర్‌లోనే ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశముందని తెలిసింది. విజయదశమికి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `సైరా నరసింహారెడ్డి` రానుంది. అందుకే… కాస్త ముందుగానే ఈ ప్రాజెక్ట్‌ని తెరపైకి తీసుకొచ్చే దిశగా ప్రణాళికలు జరుగుతున్నాయట. మరి… త్రివిక్రమ్ సమేతంగా బన్నీ మరో బ్లాక్‌బస్టర్‌ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.
[youtube_video videoid=zOb1usWzAfw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: