మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ `యన్.టి.ఆర్`. రెండు భాగాలుగా ఈ బయోపిక్ తెరకెక్కగా… తొలి భాగం `యన్.టి.ఆర్. కథానాయకుడు` పేరుతోనూ, మలి భాగం `యన్.టి.ఆర్. మహానాయకుడు` పేరుతోనూ రూపొందింది. కాగా… యన్టీఆర్ నటప్రస్థానం నేపథ్యంలో రూపొందిన `యన్.టి.ఆర్. కథానాయకుడు` సంక్రాంతి కానుకగా విడుదలైంది. సర్వత్రా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం… కొన్ని కారణాల వల్ల ఆ టాక్‌ని వసూళ్ళుగా మలుచుకోలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో… యన్టీఆర్ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కిన `యన్.టి.ఆర్. మహానాయకుడు` ఫలితంపై అంతటా ఆసక్తి నెలకొంది. తొలుత… ఈ సెకండ్ పార్ట్‌ని ఈ నెల 7న విడుదల చేయాలనుకున్నారు. అయితే… కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల తేదీలో మార్పు చోటు చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం… మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 28న లేదా మార్చి 1న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ జరుగుతోందని తెలిసింది.
నందమూరి తారక రామారావు పాత్రలో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటించిన ఈ బయోపిక్‌లో… ఇతర ముఖ్య పాత్రల్లో విద్యా బాలన్, రానా, కళ్యాణ్ రామ్ నటించారు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కీరవాణి స్వరాలు అందించారు. మరోసారి పర్వదిన సందర్భంలోనే వస్తున్న `యన్.టి.ఆర్` టీమ్‌కి ఈ సారైనా మంచి ఫలితం దక్కాలని ఆశిద్దాం..
[youtube_video videoid=rRSh7ljoFxA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: