ఇటీవలే నా నువ్వేతో అలరించిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు 118 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రేపు (మార్చి1) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రయూనిట్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. దీనిలో భాగంగానే తాజాగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న నివేథా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అసలు 118 అంటే ఏంటి.. తన పాత్ర ఏంటో చెప్పుకొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘118’ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం… ఈ సినిమాలో నా పాత్ర 20 నిమిషాలే ఉంటుంది. అయినా సినిమాకు ఆ 20 నిమిషాలే కీలకమని తెలిపింది. అంతేకాదు… 118 అనేది టైమ్… ఇందులో కల్యాణ్ రామ్ కు 1.18 గంటలకు కల్యాణ్‌కు ఓ కల వస్తుంది.. ఆ కల్లో ఓ అమ్మాయి కనిపిస్తుంది.. ఆ అమ్మాయిని నేనే.. ఇన్వెస్టిగేటివ్ అధికారి పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్ ఆకలలో వచ్చిన అమ్మాయి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు..సినిమాలో నా పాత్రకు మంచి పేరొస్తుందని వివరించింది. మరి చూద్దాం ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో.
కాగా థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నివేదా థామస్,షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.
[youtube_video videoid=KypNI5ug4vk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: