`గీత గోవిందం`వంటి సంచలన విజయం తరువాత యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, సెన్సేషనల్ బ్యూటీ రష్మిక మందణ్ణ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం `డియర్ కామ్రేడ్`. నూతన దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్రలో కనిపించనుండగా… రష్మిక క్రికెటర్ పాత్రలో దర్శనమివ్వనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాని వేసవి కానుకగా మే నెలలో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం… మే 22న `డియర్ కామ్రేడ్` తెరపైకి రాబోతున్నట్లు టాలీవుడ్ టాక్. గత ఏడాది ఇదే మే నెలలో విజయ్ దేవరకొండ అతిథి పాత్రలో నటించిన `మహానటి` విడుదలై మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో… `డియర్ కామ్రేడ్` కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.
[youtube_video videoid=r6yjcLgY8p4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: