యంగ్ హీరో శర్వానంద్, టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో శర్వానంద్‌కి జోడీగా కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ తొలిసారిగా నటిస్తున్నారు. కాగా… గత కొద్ది రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా… ఈ షెడ్యూల్ పూర్తయిందని సమాచారం. దీంతో… ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరుకున్నట్లేనని ఇన్‌సైడ్ సోర్స్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. వేసవి కానుకగా మే నెలలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శర్వానంద్ గత చిత్రం `పడి పడి లేచె మనసు` ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో… ఈ సినిమా ఫలితం శర్వాకి కీలకంగా మారింది.
[youtube_video videoid=WIoi2GW6jE4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: