ప్రస్తుతం విశాల్ టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ టెంపర్ సినిమా రీమేక్ లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. తమిళ్ లో అయోగ్య పేరుతో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ రీమేక్ లో ఓ చిన్న చేంజ్ చేసినట్టు కనిపిస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో నోరా ఫతేహితో ఇట్టాగే రెచ్చిపోదాం స్పెషల్ సాంగ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సినిమాలో ఆ పాటను రిజెక్ట్ చేశారట. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. అల్లు అర్జున్ సరైనోడు సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్టయిన బ్లాక్ బస్టర్ సాంగ్ ను పెట్టనున్నారట.. అది కూడా తెలుగులోనే. మరి ఎన్టీఆర్ మూవీలో బన్నీ సాంగ్ అంటే కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంది కదా. చూద్దాం సినిమాలో ఈ సాంగ్ కు ఎంత రెస్పాన్స్ వస్తుందో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా విశాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మురగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ సినిమాకు దర్శకతం వహిస్తున్నాడు. ఈ సినిమాలో విశాల్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. లైట్ హౌస్ ప్రొడక్షన్ హౌస్ తో కలిసి ఠాగూర్ మధు సినిమాను నిర్మిస్తున్నారు. చాలా వరకూ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి తెలుగులో సూపర్ హిట్, బాలీవుడ్ లో కూడా రీమేక్ అయిన ఈసినిమా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. విశాల్ అదృష్టం ఎలా ఉందో చూద్దాం.
[youtube_video videoid=Q4CFWcT5hPc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: