కొత్త సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

RX 100 Fame Karthikeya Next Movie Shooting Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Karthikeya Next Project Details,Rx 100 Hero Karthikeya New Film Updates,Karthikeya Upcoming Movies in 2019,Hero Karthikeya New Movie News,Karthikeya New Project Moving At A Brisk Pace
RX 100 Fame Karthikeya Next Movie Shooting Update

అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా పరిచయమవుతూ.. ‘ఆర్‌ ఎక్స్ 100 ’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా ఓ కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ బ్యానర్లపై అనిల్‌ కడియాల, తిరుమల్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈసినిమా తాజా అప్ డేట్ ఏంటంటే…ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఒంగోలులో షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా షూటింగ్ నేటితో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ “కొన్ని క‌థ‌లు విన‌గానే న‌చ్చుతాయి. మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తుకొస్తుంటాయి. న‌లుగురితో పంచుకోవాల‌నిపిస్తుంటాయి. నాకు అర్జున్ జంధ్యాల చెప్పిన క‌థ అలాంటిదే. విన‌గానే న‌చ్చింది. బెస్ట్ స్టోరీ టు టెల్ అనిపించింది. ఇటీవ‌ల ఒంగోలులో భారీ షెడ్యూల్ చేశాం. ప్ర‌తి ఫ్రేమూ రియ‌లిస్టిక్‌గా వ‌చ్చింది“ అని అన్నారు.

దర్శకుడు అర్జున్‌ జంధ్యాల మాట్లాడుతూ “రియ‌లిస్టిక్ చిత్ర‌మిది. వాస్త‌వ ఘ‌ట‌న‌లనుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న క‌థ‌. ఎంతోమంది మ‌న‌సుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. హీరో పాత్ర యువ‌త‌కు రెప్ర‌జంటేష‌న్‌లాగా ఉంటుంది. అన్నీర‌కాల భావోద్వేగాలుంటాయి. అన్నీ అంశాలూ మిళిత‌మైన స‌బ్జెక్ట్ గా రూపొందించాం. అంద‌రూ చూడ‌ద‌గ్గ చిత్ర‌మ‌వుతుంది. రియ‌లిస్టిక్ యాక్ష‌న్ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది“ అని తెలిపారు.

నిర్మాతలు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ “తొలి షెడ్యూల్ ఒంగోలులో చేశాం. దాదాపు 25 రోజులు అక్క‌డి క్వారీలు, గ్రానైట్ ఫ్యాక్ట‌రీలు, కాల‌నీలు, రిజ‌ర్వాయ‌ర్ల‌లో షూటింగ్ చేశాం. కీల‌క‌మైన టాకీ పోర్ష‌న్‌, ఒక పాట‌, కొన్ని యాక్ష‌న్ ఎపిసోడ్స్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. దీంతో దాదాపుగా 40 శాతం షూటింగ్ ముగిసింది. మార్చి 5 నుంచి యూర‌ప్‌లోని క్రొయోషియాలో రెండు పాట‌ల‌ను తెర‌కెక్కిస్తాం“ అని అన్నారు.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్‌, కెమరామెన్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్, ఎడిటర్ : తమ్మిరాజు , డాన్స్ : రఘు ,ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : శివ మల్లాల.

[subscribe]

[youtube_video videoid=JV5zScZ-2Oo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.