అందాల రాక్షసి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన నవీన్ చంద్ర తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆతరువాత పలు సినిమాల్లో నటించినా సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు. దాంతో కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించాడు. అయితే ఇప్పుడు మళ్లీ హీరోగా పలు సినిమాల్లో నటిస్తూ.. మరోసారి తన సత్తా చాటుకోవడానికి రెడీ అవుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం నవీన్ చంద్ర 28 డిగ్రీస్ సెల్సియస్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో నవీన్ చంద్ర, షాలిని వడ్నికట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 28డిగ్రీస్ సెల్సియస్. వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్ సైడ్ సినిమాస్ సంస్థపై సాయి అభిషేక్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ చూస్తుంటే ఇదేదో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలాగనే అనిపిస్తుంది. మరోసారి నవీన్ ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో వస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా నవీన్ చంద్ర ఈ సినిమాతో పాటు హీరో హీరోయిన్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. గాయత్రి సురేష్, పూజ జవేరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. మరి చూద్దాం ఈ రెండు సినిమాలు నవీన్ కు మంచి సక్సెస్ అందిస్తాయేమో.
[youtube_video videoid=WbtiDxR1DZY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: