దాదాపు పుష్కరకాలం క్రితం విడుదలైన `లక్ష్యం` (2007) చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు శ్రీవాస్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న శ్రీవాస్‌కి… ఆ తరువాత వచ్చిన `రామరామ కృష్ణ కృష్ణ`, `పాండవులు పాండవులు తుమ్మెద` సినిమాలు ఆశించిన విజయాలను అందించలేకపోయాయి. ఈ నేపథ్యంలో… తన తొలి చిత్ర కథానాయకుడు గోపీచంద్ కాంబినేషన్‌లోనే రూపొందించిన `లౌక్యం`తో మంచి కమర్షియల్ హిట్‌ని సొంతం చేసుకున్నాడు శ్రీవాస్. అయితే… ఆ తరువాత వచ్చిన `డిక్టేటర్`, `సాక్ష్యం` చిత్రాలు నిరాశపరిచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొత్తమ్మీద… పుష్కరకాలంలో కేవలం ఆరు చిత్రాలకే పరిమితమైన శ్రీవాస్… ఇప్పుడు ఏడో సినిమాకి సిద్ధమవుతున్నాడట. వినిపిస్తున్న కథనాల ప్రకారం… తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని నందమూరి కళ్యాణ్ రామ్‌తో ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్ టాక్. అంతేకాదు… ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల్ కథను అందిస్తున్నాడని సమాచారం. త్వరలోనే కళ్యాణ్ రామ్, శ్రీవాస్ కాంబినేషన్ మూవీపై స్పష్టత రావచ్చు.
[youtube_video videoid=Kdgq_Y2AKLw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: