`యాత్ర‌` ద‌ర్శ‌కుడితో దుల్క‌ర్ స‌ల్మాన్‌?

Dulquer Salmaan in Mahi V Raghav Direction,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Dulquer Salmaan Next Movie With Yatra Director,Director Mahi V Raghav New Film With Dulquer Salmaan,Dulquer Salmaan Roped For Director Mahi V Raghav,Actor Dulquer Salmaan Upcoming Movie News,Mahi V Raghav To Director Dulquer Salmaan
Dulquer Salmaan in Mahi V Raghav Direction

మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త నేత వై.ఎస్‌.రాజేశేఖ‌ర రెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానంలో ఓ కీల‌క ఘ‌ట్టం… పాద‌యాత్ర. ఈ పాద‌యాత్ర‌ను ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రం `యాత్ర‌`. స‌రిగ్గా 20 రోజుల క్రితం విడుద‌లైన `యాత్ర‌` సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. కేర‌ళ మెగాస్టార్ మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో మ‌హి వి.రాఘ‌వ్‌ రూపొందించిన ఈ సినిమా మ‌ల‌యాళంలోనూ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. మ‌మ్ముట్టికి ఉన్న క్రేజ్‌తో కేర‌ళ‌లోనూ ఈ చిత్రం మంచి వ‌సూళ్ళ‌ను రాబ‌ట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… మ‌మ్ముట్టి త‌న‌యుడు, ప్ర‌ముఖ న‌టుడు దుల్క‌ర్ సల్మాన్… ఇటీవ‌లే `యాత్ర‌` మ‌ల‌యాళ వెర్ష‌న్‌ను చూసి ఎంతో ఇంప్రెస్ అయి… వెంట‌నే మ‌హికి ఫోన్ చేసి అభినంద‌న‌లు తెలియ‌జేశాడ‌ట‌. అంతేకాదు… మంచి స్క్రిప్ట్ కుదిరితే… సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని తెలియ‌జేశాడ‌ట‌. మ‌రి… తండ్రితో మెమ‌ర‌బుల్ ఫిల్మ్ రూపొందించిన మ‌హి… త‌న‌యుడితోనూ అదే త‌ర‌హా సినిమా తెర‌కెక్కిస్తాడేమో చూడాలి. కాగా… దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన తొలి తెలుగు చిత్రం `మ‌హాన‌టి` తెలుగునాట ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

[subscribe]

[youtube_video videoid=faFMjO52Hic]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =