సూపర్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసిన మహానటి

Heroines Fixed For Rajinikanth And AR Murugadoss Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rajinikanth And AR Murugadoss New Movie Heroine,Keerthy Suresh Next With Super Star RajiniKanth,Rajinikanth New Film Latest Updates,Rajinikanth And AR Murugadoss Movie Latest News
Heroines Fixed For Rajinikanth And AR Murugadoss Movie

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కునున్న సంగతి తెలిసిందే. ఇక మురగదాస్ సమాజానికి కాస్త దగ్గరగా ఉండే కథలను తీస్తుంటారు కాబట్టి అప్పుడే ఈసినిమాపై కూడా పలు రకాల టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా రాజకీయాల నేపథ్యంలో ఉంటుందని.. టైటిల్ కూడా నార్కాలి అని ఖరారు చేశారని ఇలా పలు రకాల రూమర్లే వినిపించాయి. అయితే వాటిలో ఎలాంటి నిజం లేదు.. అన్ని వర్గాలకు నచ్చే మాస్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించనున్నట్టు మురగదాస్ క్లారిటీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో హీరోయిన్లు కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇద్దరు హీరోయిన్లు నటించనుండగా…అందులో ఒక హీరోయిన్ గా కీర్తి సురేష్ ను కన్ఫామ్ చేశారట. దీంతో సూపర్ స్టార్ పక్కన కీర్తి సురేష్ సూపర్ ఛాన్స్ కొట్టేసిందంటున్నారు. నిజానికి మురగదాస్ సినిమాల్లో ఒక హీరోయిన్ ను రిపీట్ చేయడం కష్టం. అలాంటిది ఈ మహానటి ఏం మాయ చేసిందో కానీ… వ‌రుస‌గా రెండో ఛాన్స్ కొట్టేసింది. గతంలో మురుగ‌దాస్ – విజ‌య్‌ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `స‌ర్కార్‌`లో క‌థానాయిక‌గా న‌టించింది కీర్తి సురేష్‌. ఇప్పుడు మ‌రోసారి మురుగ‌దాస్ సినిమాలో క‌థానాయిక‌గా ఎంపికైంది. మొత్తానికి కీర్తి సురేష్ కోలివుడ్ లో వరుస్ ఆఫర్లతో అది కూడా పెద్ద పెద్ద స్టార్ లతోనే నటిస్తూ దూసుకుపోతుంది.

ఇక మరో హీరోయిన్ గా నయనతారను ఎంచుకున్న‌ట్టు స‌మాచారం. ర‌జనీతో న‌య‌న‌తార క‌ల‌సి న‌టించ‌డం ఇది మూడోసారి. చంద్ర‌ముఖి, క‌థానాయ‌కుడు చిత్రాల‌లో వీరిద్ద‌రూ జోడీ క‌ట్టారు. మురుగ‌దాస్ సినిమాలో న‌య‌న క‌నిపించ‌డం ఇది రెండోసారి. ఇది వ‌ర‌కు గ‌జ‌నిలో ఓ కీల‌క‌పాత్ర పోషించింది న‌య‌న్. మరి పేట లోనూ ఇద్దరు నాయికలతో నటించిన రజినీ.. ఈ సినిమాలో కూడా ఇద్దరు నాయికలతో నటించడం గమనార్హం.

[subscribe]

[youtube_video videoid=fQhu517vBRw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.