అలనాటి అందాల తార.. లెజెండరీ నటి శ్రీదేవి తన సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్, హిందీ ఇంకా మరెన్నో భాషల్లో నటించి బహుబాషా నటిగా మొట్ట మొదటి లేడీ సూపర్ స్టార్ గా పేరుతెచ్చుకుంది. ఇక వివాహం తరువాత సినిమాలకు దూరమైన శ్రీదేవి ఆ తరువాత ఎన్నో ఏళ్లకు ఇంగ్లీష్ వింగ్లీష్ అనే బాలీవుడ్ మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్స్ చేసింది. ఇక తాను నటించిన చివరి సినిమా ‘మామ్’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రవి ఉద్యావర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. 2017లో ఈ సినిమా విడుదలై మంచి సక్సెస్ సాధించింది. రివెంజ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో తన అద్భుతన నటనకుగాను జాతీయ ఉత్తమ నటి అవార్డ్ దక్కింది. నటిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో శ్రీదేవి నటించిన 300వ చిత్రం ఇది. అలాంటి సినిమాను ఇప్పుడు చైనాలో కూడా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ‘జీ స్టూడియోస్ ఇంటర్నేషనల్’ వారు’మామ్’ చిత్రాన్ని ఇప్పుడు చైనాలో భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మార్చి 22న చైనాలో విడుదల చేయనున్నారట.
ఈసందర్బంగా బోనీ కపూర్ మాట్లాడుతూ… శ్రీదేవి చివరగా నటించిన ఈ చిత్రాన్ని తన జ్ఞాపకంగా అందరికీ అందించాలన్నదే మా లక్ష్యం. ‘‘మామ్’ సినిమా ప్రతి తల్లికి కనెక్ట్ అవుతుంది. స్టూడియోస్ ఇంటర్నేషనల్ వారు మొదటి నుండి మాకు తోడుగా ఉన్నారు. రిలీజైన రెండేళ్ల తర్వాత కూడా వారు ఈ చిత్రాన్ని ప్రపంచ నలుమూలలకీ తీసుకెళ్లడం ఆనందంగా ఉందన్నారు. ఆమె చివరి మధురమైన సినిమాను వీలైనంత మందికి చూపించాలనేదే మా ఉద్దేశం’ అని తెలిపారు.
[youtube_video videoid=4gWJMQ3ixNM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: