వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవితంలో అతి కీలకమైన పార్ట్ ను తీసుకొని లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాతో అప్పటి ఘటనలను వెండి తెరపై చూపించనున్నాడు వర్మ. ఇక వర్మ ఎప్పుడైతే ఈసినిమా గురించి ప్రకటన చేశారో అప్పటి నుండి ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారు కూడా చాలా మంది ఉన్నారు. నిజానికి క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు.. ఎన్టీఆర్ మహానాయకుడు కంటే కూడా వర్మ తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించే అందరిలో ఆసక్తి ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దానికి తోడు వర్మ ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ ఇస్తున్నా కూడా క్షణాల్లో వైరల్ అవ్వడం కూడా సినిమాపై ఎంత ఇంటెస్ట్ ఉందో తెలియజేస్తుంది. వాస్తవాలతో ఈ సినిమాను తెరకెక్కించారని, కచ్చితంగా ఈ సినిమా చూడాలని ప్రతిఒక్కరూ అనుకుంటున్నారు. దీంతో ఈ సినిమాపై పెరిగిన క్రేజ్ కారణంగా సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. భారీ మొత్తాలకు ఈ సినిమాను అమ్మేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దీనిపై వర్మ తన ట్విట్టర్ ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చేశారు. ఆ ట్వీట్ ఏంటో మీరు కూడా చూడండి.
లక్ష్మి స్ఎన్టీఆర్ కి సంబందించి గమనిక లక్ష్మీస్ ఎన్టీఆర్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో ఏదో ఖరీదుకి కొనుక్కున్నారు అని వస్తున్న రక రకాల వార్తల్లో నిజాలు లేవు …ఎవరికి ఏ ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు Gv films , RGV మరియు రాకేష్ రెడ్డిలు త్వరలో అప్డేట్ చేస్తారు.
— Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2019
కాగా ఇక ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తుండగా.. కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రలో వంగవీటి ఫేం శ్రీతేజ్ కనిపించనున్నాడు. ఇక ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ నటిస్తున్నారు.
[youtube_video videoid=WbtiDxR1DZY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: