`జెంటిల్ మన్`, `నిన్ను కోరి`, `జై లవ కుశ` చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ముద్దుగుమ్మ నివేదా థామస్. గ్లామర్ రోల్స్ కంటే పెర్‌ఫార్మెన్స్ రోల్స్‌కే ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ అందాల తార… దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తరువాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది. ఆ చిత్రమే… `118`. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా రేపు (మార్చి 1) ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే… `జై లవ కుశ` తరువాత ఉన్నత చదువులపై దృష్టి పెట్టిన నివేదా… స్వల్ప విరామం తరువాత ఆ సినిమాని నిర్మించిన కళ్యాణ్ రామ్ చిత్రంతోనే మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి… గత చిత్రానికి నిర్మాతగా కలిసొచ్చిన కళ్యాణ్ రామ్… ఇప్పుడు కథానాయకుడిగానూ నివేదాకి మంచి విజయాన్ని ఇస్తాడేమో చూడాలి. కాగా… ప్రస్తుతం నివేదా `శ్వాస`, `బ్రోచేవారెవరురా` అనే తెలుగు చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్నాయి.
[youtube_video videoid=olinfOgbNr4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: