పాత సినిమాల టైటిల్స్‌తో కొత్త చిత్రాలు సందడి చేయడం తెలుగు పరిశ్రమలో కొత్తేమీ కాదు. ప్రతీ సంవత్సరం ఈ తరహా టైటిల్స్‌తో చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడు ఈ జాబితాలోనే మరో కొత్త చిత్రం… పాత టైటిల్‌తో సందడి చేయనుంది. అదే… `గ్యాంగ్ లీడర్`.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన `గ్యాంగ్ లీడర్` (1991) టైటిల్‌తో దాదాపు 28 ఏళ్ళ తరువాత మరో సినిమా రాబోతోంది. అదే… నేచురల్ స్టార్ నాని నయా ప్రాజెక్ట్ `గ్యాంగ్ లీడర్`. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి బజ్ మరింత పెరిగింది.
ఇదిలా ఉంటే… పాత టైటిల్స్‌తో నాని నుంచి సినిమాలు రావడం ఇదే తొలిసారి కాదు. `పిల్ల జమీందార్`తో మొదలు పెట్టి… `జెంటిల్ మన్`, `మజ్ను`, `కృష్ణార్జున యుద్ధం`, `దేవదాస్`… తాజాగా `గ్యాంగ్ లీడర్` వరకు… మొత్తంగా ఆరు సార్లు పాత టైటిల్స్‌ని రిపీట్ చేశాడు నాని. వీటిలో సింహభాగం విజయం సాధించిన నేపథ్యంలో… `గ్యాంగ్ లీడర్` కూడా అదే బాటలో వెళుతుందేమో చూడాలి. ఆగస్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=FMwGC9-TIhQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: