ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరుచుకున్న ఈసినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. వర్మ తీసుకున్న పాయింటే అలాంటిది. ఎవరూ టచ్ చేయని.. టచ్ చేయడానికి భయపడే.. ఎన్టీఆర్ లైఫ్ లో అతి కీలకమైన టైమ్ పీరియడ్ నే సెలక్ట్ చేసుకున్నాడు. అందుకే ప్రతి ఒక్కరికీ అంత ఇంట్రెస్ట్ ఏర్పడింది. ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఆర్జీవి యూట్యూబ్ చానల్లో కోటికి పైగా మంది చూసారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ చిత్రాన్ని మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఈ సంవత్సరంలో మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ గా మారిన ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ చిత్రం వేసవి కాలం పూర్తిగా రాకముందే అందరిలో వేడి సెగలు పుట్టిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
టెక్నీషియన్స్-
ఎ జివి ఆర్జీవి ఫిల్మ్స్ ప్రెజెంట్స్,
దర్శకత్వం :రాం గోపాల్ వర్మ & అగస్త్య మంజు
నిర్మాతలు :రాకేష్ రెడ్డి &దీప్తి బాలగిరి
సినిమాటోగ్రఫీ : రమ్మీ
రచన : రాం గోపాల్ వర్మ & నరేంద్ర చారి
మ్యూజిక్ : కళ్యాణ్ కోడూరి
ఎడిటర్ : కమల్ ఆర్
కాస్ట్యూమ్ డిజైనర్ : వెంకటేష్ జక్కుల
కొరియోగ్రఫీ : శంకర్ మాస్టర్
లిరిక్స్ : సిరా శ్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సూర్య చౌదరి
ప్రొడక్షన్ కంట్రోలర్ : పాండి
సౌండ్ డిజైన్ : యతి రాజు
[youtube_video videoid=WbtiDxR1DZY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: