
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 88


తరుణ్ భాస్కర్ కు జంటగా అవంతిక మిశ్రా

అనూప్ రూబెన్స్ స్వరవిన్యాసాలకు 15 ఏళ్ళు

వాల్మీకి మూవీ లో తమిళ హీరో

ఒకే రోజున మూడు రాజకీయ నేపథ్య చిత్రాలు

మరో తమిళ చిత్రంలో రష్మిక?

రూట్ మార్చిన మిల్కీబ్యూటీ

AMB సినిమాస్ లో మైనపు విగ్రహావిష్కరణ డేట్ ఫిక్స్

మజిలీ రిలీజ్ ఆరోజే

అమ్మ బయోపిక్ లో బాలీవుడ్ క్వీన్

భారీగా ‘డియర్ కామ్రేడ్’ ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రేమ కథా చిత్రమ్2 రిలీజ్ కు ముహూర్తం ఖరారు

ఎమర్జెన్సీ నేపథ్యంలో రానా `విరాటపర్వం`?

చిరంజీవి `స్టేట్ రౌడీ`కి 30 ఏళ్ళు

మళ్లీ మారిన అర్జున్ సురవరం రిలీజ్ డేట్

ప్రభాస్ 20లో కాజల్?
బాలకృష్ణ, రాజశేఖర్ మల్టీస్టారర్ పై క్లారిటీ

ఈసారి ట్రాక్ తప్పితే కష్టమే

బన్నీ సినిమాలో రజినీకాంత్ విలన్?
గత ఏడాది వేసవికి `నా పేరు సూర్య`తో పలకరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... భారీ విరామం తరువాత తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించనున్న సంగతి తెలిసిందే. ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ సినిమా... త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. కాగా... తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన `కాలా` సినిమాలో నానా విలన్‌గా అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో తొలిసారిగా నానా నటించే ఇదే అవుతుంది…

తరుణ్ భాస్కర్ కు జంటగా అవంతిక మిశ్రా
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కింగ్ ఆఫ్ ది హిల్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ పై నిర్మిస్తున్న మొదటి మూవీ లో సూపర్ హిట్ మూవీ పెళ్ళి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరో గా పరిచయం చేస్తున్నారు. షమీర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీ లో అనసూయ భరద్వాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

అనూప్ రూబెన్స్ స్వరవిన్యాసాలకు 15 ఏళ్ళు
మెలోడీ పాటలకు చిరునామాగా నిలిచిన ఈ తరం స్వరకర్తల్లో అనూప్ రూబెన్స్ ఒకరు. తొలి చిత్రం `జై` నుంచి గత చిత్రం `హలో` వరకు అనూప్ది ఇదే బాణి. కెరీర్ ఆరంభంలో ఆశించిన విజయాలు దక్కకపోయినా... ఒక సంగీత దర్శకుడిగా అనూప్ ఏ సినిమాతోనూ స్వరాభిమానులను నిరాశపరచలేదనే చెప్పాలి.

వాల్మీకి మూవీ లో తమిళ హీరో
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వం లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వాల్మీకి మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ జిగర్ తాండ కు తెలుగు రీమేక్ వెర్షన్ వాల్మీకి మూవీ. ఈ మూవీ లో వరుణ్ తేజ్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించడం విశేషం. మృణాళిని రవి కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఒకే రోజున మూడు రాజకీయ నేపథ్య చిత్రాలు
ప్రస్తుతం ఎన్నికల తరుణం. ఒకవైపు ఎన్నికల ప్రచారం జోరుగా ఉన్నా.. మరోవైపు వెండితెరపై సినిమాల హవా సాగుతూనే ఉంది. ఇక ఈ శుక్రవారం అయితే చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు రిలీజ్ కానున్నాయి. ముఖ్యంగా.. మార్చి 29న మూడు రాజకీయ నేపథ్య చిత్రాలు తెరపైకి రాబోతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ మూడు సినిమాలు కూడా ముగ్గురు ముఖ్యమంత్రుల జీవితాలతో ముడిపడ్డ చిత్రాలు కావడం విశేషం.

జూలై నుంచి బాలకృష్ణ, బోయపాటి చిత్రం?
నటసింహ నందమూరి బాలకృష్ణకి అచ్చొచ్చిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన `సింహా` (2010), `లెజెండ్` (2014) చిత్రాలు ఆ యా సంవత్సరాల్లో బాక్సాఫీస్‌కి కొత్త కళను తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో... ఐదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత వీరి కలయికలో మరో సినిమా రానుంది. గత చిత్రాల తరహాలోనే ఈ సారి కూడా కమర్షియల్ ఎంటర్టైనర్తోనే ఈ కాంబో పలకరించనుందని సమాచారం.

మరో తమిళ చిత్రంలో రష్మిక?
కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో సంచలన కథానాయికగా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్న. రెండు చోట్లా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ కన్నడ కస్తూరి... ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా నటిస్తున్న ఈ సినిమా... శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే... కార్తి సినిమా పూర్తయ్యే లోపే రష్మిక మరో తమిళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కోలీవుడ్ టాక్.

రూట్ మార్చిన మిల్కీబ్యూటీ
ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా హార్రర్ సినిమాల హవా కొనసాగుతుంది. ఇన్ని రోజులు గ్లామర్ పాత్రలు చేసి బోరుకొట్టిన హీరోయిన్స్ సైతం దెయ్యంలా మారి ప్రేక్షకులను భయపెట్టడానికి ఏమాత్రం భయపడకుండా హార్రర్ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు తమన్నా కూడా ఆబాటలోనే నడుస్తోంది. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రలవైపే మొగ్గు చూపిన తమన్నా.. ఇప్పుడు ట్రాక్ మార్చి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు.. అందులో హార్రర్ సినిమాల పై దృష్టి పెట్టింది.

AMB సినిమాస్ లో మైనపు విగ్రహావిష్కరణ డేట్ ఫిక్స్
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా నటులతో పాటు ప్రముఖుల మైనపు బొమ్మలు ఈ మ్యూజియంలో కొలువుతీరతాయి. అలాగే మన టాలీవుడ్ నుండి ఆ అవకాశం సూపర్ స్టార్ మహేష్ బాబుకు దక్కిన సంగతి కూడా తెలిసిందే. మహేష్ కు ఉన్న పాపులారిటీ గుర్తించిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు ఆయన మైనపు విగ్రహాన్ని తయారు చేసి.. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టబోతున్నారు.

మజిలీ రిలీజ్ ఆరోజే
నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత కలిసి జంటగా నటిస్తున్న సినిమా మజిలీ. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య, సమంత భార్యాభర్తల్లాగ కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్సే ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఇక రీసెంట్ గా రిలీజైన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడం.. దానికి తోడు ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు ఇంకా ఎక్కువయ్యాయి.

అమ్మ బయోపిక్ లో బాలీవుడ్ క్వీన్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా ఇప్పటికే పలువురు డైరెక్టర్లు ఆమె బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. వారిలో తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. అయితే ఈయన బయోపిక్ లో జయలలిత గా ఎవరు కనిపిస్తారబ్బా అని అందరూ అనుకుంటుండగా.. అశ్చర్యంగా ఎవరూ ఊహించని విధంగా ఆ అవకాశం బాలీవుడ్ క్వీన్ కు దక్కింది. ఈ బయోపిక్ లో జయలలిత గా కంగనా రనౌత్ నటిస్తుంది. ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రకటన చేశారు విజయ్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ బయోపిక్ తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది.

భారీగా ‘డియర్ కామ్రేడ్’ ప్రీ రిలీజ్ బిజినెస్
వరుస హిట్లు కొట్టి సంచలనం సృష్టించిన విజయ దేవరకొండ ఇప్పుడు తన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా సంచలనం సృష్టిస్తున్నాడు. గత ఏడాది గీత గోవిందం సినిమా 15 కోట్లు బిజినెస్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే అప్పుడు అర్జున్ రెడ్డి వల్ల అంత బిజినెస్ అయిందిలే అని ఆ క్రెడిట్ అర్జున్ రెడ్డి ఖాతాలో వేసేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అర్జున్ రెడ్డి తరువాత గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో హిట్లు కొట్టి తన సత్తా మరోసారి చూపించాడు విజయ్. గీత గోవిందం ఏకంగా 70 కోట్లకు పైగా వసూలు చేయగా.. టాక్సీవాలా కూడా 24 కోట్ల వరకు వసూలు చేసి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. దాంతో ఇప్పుడు డియర్ కామ్రేడ్…

ప్రేమ కథా చిత్రమ్2 రిలీజ్ కు ముహూర్తం ఖరారు
సుధీర్ బాబు, నందిత హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ప్రేమ కథాచిత్రమ్ మూవీ కి సీక్వెల్ ప్రేమ కథాచిత్రమ్ 2 - బ్యాక్ టు ఫియర్ అనే ట్యాగ్ లైన్ తో సినిమా రూపొందుతున్న సంగతి కూడా విదితమే. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఈ చిత్రం ఈనెల 21న విడుదలకావాల్సి ఉండగా వాయిదాపడింది. ఇక తాజాగా ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా ఏప్రిల్ 6న విడుదల చేయనున్నారు.

ఎమర్జెన్సీ నేపథ్యంలో రానా `విరాటపర్వం`?
రానా నట ప్రస్థానం రాజకీయ నేపథ్య చిత్రాలతోనే మొదలైంది. `లీడర్` (2010)లో యువ ముఖ్యమంత్రి అర్జున్ ప్రసాద్‌గా పాత్రలో ఒదిగిపోయిన వైనం... రానాకి నటుడిగా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. కట్ చేస్తే... 2017లో విడుదలైన మరో రాజకీయ నేపథ్య చిత్రం `నేనే రాజు నేనే మంత్రి`లోనూ జోగేంద్రగా మెస్మరైజ్ చేశాడు రానా. ఈ రెండు చిత్రాలు సమకాలీన పరిస్థితులను దర్పణం పడుతూ తెరకెక్కిన సినిమాలు కాగా... ఈ సారి పిరియాడిక్ టచ్ ఉన్న పొలిటికల్ మూవీలో నటించబోతున్నాడట రానా.

చిరంజీవి `స్టేట్ రౌడీ`కి 30 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి అంటేనే పలు రికార్డులకు కేంద్ర బిందువు. ఆయన నటించిన అనేక చిత్రాలు రికార్డు స్థాయి విజయాలను అందుకోవడమే కాకుండా... కొత్త రికార్డులను నెలకొల్పాయి. అలా... నైజాంలో రూ.కోటి వసూళ్ళు చేసిన తొలి తెలుగు చిత్రంగా `స్టేట్ రౌడీ` అప్పట్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. బి.గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత టి.సుబ్బిరామిరెడ్డితో పాటు పి.శశిభూషణ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. చిరంజీవికి జోడీగా రాధ, భానుప్రియ నటించిన ఈ చిత్రంలో శారద, రావుగోపాల రావు, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, త్యాగరాజన్, నూతన్ ప్రసాద్ తదితరులు…

మళ్లీ మారిన అర్జున్ సురవరం రిలీజ్ డేట్
మొన్నటి వరకూ టైటిల్ విషయంలో ఇబ్బది పడ్డ నిఖిల్ సినిమా అర్జున్ సురవరం కు ఇప్పుడు రిలీజ్ విషయంలోనూ ఇబ్బందులు తప్పటంలేదు. రెండు రోజుల క్రితం మార్చి 29వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు వార్తలు రాగా ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ కూడా మార్చుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి ఉండటంతో ఈ టైంలో రిలీజ్ చేస్తే వసూళ్ల మీద ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారట. ఇక ఏప్రిల్ లో ఏలాగూ రిలీజ్ చేయలేరు. ఎందుకంటే ఇప్పటికే చాలా సినిమాలు ఏప్రిల్ ను బుక్ చేసుకున్నాయి. దీంతో ఈసినిమాను మే 1న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ప్రభాస్ 20లో కాజల్?
కాజల్ అగర్వాల్... టాలీవుడ్ చందమామ. అంతేకాదు... ఈ తరం అగ్ర కథానాయకులందరికి కలిసొచ్చిన కథానాయిక. ముఖ్యంగా... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ `డార్లింగ్`(2010), `మిస్టర్ పర్ఫెక్ట్`(2011) చిత్రాల్లో నాయికగా నటించడమే కాదు... రెండు ఘనవిజయాలను తన ఖాతాలో వేసుకుని మరీ వార్తల్లో నిలచింది కాజల్. కట్ చేస్తే... దాదాపు ఎనిమిదేళ్ళ తరువాత ఈ ఉత్తరాది సోయగం... ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని టాలీవుడ్ టాక్.
పరాజయాల బాట నుండి విజయాల వేటలో టాలీవుడ్ హీరోలు
ఏ రంగంలోనైనా జయాపజయాలు సహజం. సినిమా రంగంలో మరింత సహజం. దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు ఇలా ఎవరిని తీసుకున్నా వరుస విజయాల ట్రాక్ రికార్డ్ ఎవరికీ ఉండదు. ఒక హిట్ వస్తే వరుసగా నాలుగు ఫ్లాపులు మీద పడిపోవడం ప్రతి ఒక్కరికి ఎదురయ్యే అనుభవమే. వరుస విజయాలు సాధించడం దాదాపుగా ఎవరికీ సాధ్యం కాదు. కెరీర్ ప్రారంభ దశలో ఎవరికైనా వరుస విజయాలు వస్తే వచ్చి ఉండవచ్చు కానీ అవి శాశ్వతంగా కొనసాగిన చరిత్ర ఎవరికీ లేదు... ఉండదు కూడా. కాబట్టి వరుస విజయాలు, వరుస పరాజయాలు ఎవరికి ఉండవు. విజయాల సంఖ్య తక్కువ అపజయాల సంఖ్య ఎక్కువగా ఉండటం సినిమా ప్రపంచం లో సర్వసాధారణం. ఇప్పటివరకు తమ కెరీర్లో ప్లాపుల కన్నా హిట్స్ ఎక్కువ…
బాలకృష్ణ, రాజశేఖర్ మల్టీస్టారర్ పై క్లారిటీ
నందమూరి బాలకృష్ణ, రాజశేఖర్ కాంబినేషన్ లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కబోతున్నట్టు గత కొద్దిరోజులుగా ఈ వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో పుష్కర్ గాయత్రి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్ వేద. తమిళంలో తెరకెక్కిన ఈసినిమా 2017 లో విడుదలైన సంచలన విజయం సాధించింది.

ఈసారి ట్రాక్ తప్పితే కష్టమే
సొంతం, నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి ఇలా చెప్పుకుంటూ పోతే సునీల్ తన కామెడీ టైమింగ్ తో చంపేసిన సినిమాలు లిస్ట్ పెరుగుతూపోతుంది. గోదారోళ్లకి కాస్త ఎటకారం ఎక్కువ అన్నట్టు... ఆ ఎటకారం మొత్తం తన పంచ్ డైలాగుల్లోనే కనిపించేట్టు పంచులు వేయడంలో.. ఓ డిఫరెంట్ వాయిస్ తో కామెడీ చేయడంలో సునీల్ రూటే సెపరేటు.