
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 89


మే మొదటి వారం నుంచి అఖిల్ చిత్రం?

తమిళ్ అర్జున్ రెడ్డికి తండ్రిగా స్టార్ డైరెక్టర్

వినరా సోదర వీర కుమారా మూవీ మౌత్ టాక్

బన్నీ చిత్రంలో టబు?

బాలీవుడ్ మూవీ లో కీర్తి సురేష్

కళ్యాణ్ రామ్ `తుగ్లక్` అప్డేట్

జెస్సీ కి సూపర్ రెస్పాన్స్

'విలన్' పాత్రలపై ఇంట్రెస్ట్ చూపుతున్న హీరోలు

మరో కొత్త సినిమాకు నితిన్ గ్రీన్ సిగ్నల్

మన్మథుడు-2 మూవీలో రకుల్ ప్రీత్ సింగ్

`క్వీన్` రీమేక్ కోసం అమితాబ్ గానం?

వరుణ్ వాల్మీకి షూటింగ్ అప్ డేట్
వరుస హిట్లతో కెరీర్ లో దుసుకుపోతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. డిఫరెంట్ స్టోరీలు ఎంచుకుంటూ... నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు తాజాగా మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ మూవీ జిగర్తాండ రీమేక్ వాల్మీకి సినిమాలో వరుణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ లో వరుణ్ తేజ్ వచ్చే నెల అంటే ఏప్రిల్ 16వ తేదీ నుండి పాల్గొననున్నాడట. కాగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగిటివ్ రోల్ లో చేయనున్నాడు.

మే మొదటి వారం నుంచి అఖిల్ చిత్రం?
`అఖిల్`, `హలో`, `Mr. మజ్ను` చిత్రాలతో అలరించిన యువ కథానాయకుడు అక్కినేని అఖిల్... ప్రస్తుతం తన నాలుగో చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. `బొమ్మరిల్లు` భాస్కర్ దర్శకత్వంలో న్యూ ఏజ్ రొమాంటిక్-కామెడీ ఫిల్మ్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించనుంది. ఇందులో అఖిల్‌కి జోడీగా `భరత్ అనే నేను`, `వినయ విధేయ రామ` చిత్రాల నాయిక కియరా అద్వాని నటించనుందని సమాచారం.

బెల్లంకొండ - అజయ్ భూపతి సినిమాకి ముహుర్తం కుదిరిందా?
`ఆర్ ఎక్స్ 100` వంటి సంచలన చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలతో పాటు ఘనవిజయాన్ని కూడా తన ఖాతాలో నమోదు చేసుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ప్రస్తుతం తన రెండో సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు అజయ్. తొలి చిత్రం తరహాలోనే తన మలి సినిమాని కూడా రా సబ్జెక్ట్‌తోనే తెరకెక్కిస్తున్నాడని టాలీవుడ్ టాక్.

చీకటి గదిలో చితక్కొట్టుడు, పులిజూదం ఫస్ట్ డే కలెక్షన్స్
సంతోష్ పి జయకుమార్ దర్శకత్వంలో ఆదిత్ అరుణ్ హీరోగా తెరకెక్కిన చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా నిన్న మార్చి 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనితో పాటు విశాల్, మోహన్ లాల్ నటించిన పులిజూదం సినిమా కూడా రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ రెండు సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

తమిళ్ అర్జున్ రెడ్డికి తండ్రిగా స్టార్ డైరెక్టర్
సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమాను తమిళ్ లో కూాడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ తనయుడు దృవ ఈ రీమేక్ లో నటిస్తుండగా ఇటీవలే రెండోసారి మళ్లీ సినిమాను షూట్ చేస్తున్నారు. మొదట బాల దర్శకత్వంలో సినిమాను తీయగా.. అవుట్ పుట్ సరిగా రాలేదని నిరాశ చెందిన నిర్మాతలు మళ్లీ రీ షూట్ చేస్తున్నారు. ధృవ మినహా అందరు నటీనటులను, దర్శకుడు బాలను సైతం మార్చి తిరిగి షూటింగ్ ప్రారంభించారు.. ఈ కొత్త వెర్షన్ కు గిరిసాయి దర్శకుడు. బనితా సంధూ హీరోయిన్. అంతేకాదు వర్మ టైటిల్ ను కూాడా…

వినరా సోదర వీర కుమారా మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

వినరా సోదర వీర కుమారా తెలుగు మూవీ రివ్యూ
ఇక ఫైనల్ గా చెప్పాలంటే.. ఈసినిమా కేవలం యూత్ కి మాత్రమే కాదు అందరూ చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు.

`సీత`లో పాయల్ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయా?
పాయల్ రాజ్‌పుత్... గత ఏడాది సంచలన విజయం సాధించిన `ఆర్ ఎక్స్ 100`తో ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగిన వర్థమాన తార. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉందీ ఉత్తరాది భామ. ఓవైపు రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో నటిస్తూనే... మరో వైపు `వెంకీమామ`లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌కి జోడీగా నటిస్తోంది. అలాగే... `మన్మథుడు 2`లో కింగ్ నాగార్జునకి జోడీగా ఇద్దరు నాయికలలో ఒకరిగా నటించనుందని ప్రచారం సాగుతోంది.

బన్నీ చిత్రంలో టబు?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి జట్టుకడుతున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి `నాన్న నేను` అనే పేరు ప్రచారంలో ఉంది. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

బాలీవుడ్ మూవీ లో కీర్తి సురేష్
టాలీవుడ్, కోలీవుడ్ లలో అగ్ర కధానాయిక గా వెలుగొందుతున్న అందం, అభినయం కలబోసిన కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేను శైలజ, మహానటి మూవీస్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి సురేష్ పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న మూవీస్ ను ఏ భాషలోనైనా ఎంపిక చేసుకుంటున్నారు. తెలుగు లో నూతన దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ కీర్తి సురేష్ నటిస్తున్న 20వ మూవీ.

కళ్యాణ్ రామ్ `తుగ్లక్` అప్డేట్
`118`తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్. ప్రస్తుతం... ఈ టాలెంటెడ్ హీరో తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాకి నూతన దర్శకుడు మల్లిడి వేణు దర్శకత్వం వహించనున్నాడు. కాగా... ఈ సినిమాకి `తుగ్లక్` అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాని మే నుంచి పట్టాలెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హౌస్ అరెస్ట్ ?
1993 సంవత్సరం లో నటుడు, నిర్మాత మోహన్ బాబు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని తిరుపతి లో శ్రీ విద్యా నికేతన్ ట్రస్ట్ ప్రారంభించిన విషయం తెలిసిందే. శ్రీ విద్యా నికేతన్ ట్రస్ట్ లోని పలు కాలేజీలు విద్య ను అందిస్తున్నాయి. ఫీజ్ రీఎంబర్స్ మెంట్ విషయం లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నందుకు నిరసనగా ఈ రోజు ర్యాలీ కి మోహన్ బాబు పిలుపు నిచ్చారు.

అక్షర సినిమా నుండి అసురులదర సాంగ్ రిలీజ్
ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నందిత శ్వేత ప్రస్తుతం ప్రేమ కథా చిత్రమ్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కామెడీ హారర్ గా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రమ్ కు సీక్వెల్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. దానితో పాటు నందిత అక్షర్ అనే మరో థ్రిల్లర్ మూవీలో కూడా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి అసురులదర అనే పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇటీవల వస్తున్న పాటలకు కాస్త భిన్నంగా ఉన్న ఈపాట ఆకట్టుకుంటుంది.

పులిజూదం తెలుగు మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే తెలుగు నేటివిటీ లేకపోవడంతో అందరికీ ఈ సినిమా నచ్చుతుందని చెప్పలేం. కానీ..క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి మాత్రం ఈసినిమా పర్వాలేదనిపిస్తుంది.

జెస్సీ కి సూపర్ రెస్పాన్స్
రామ్ గోపాల్ వర్మ సినిమా 'దెయ్యం' నుండి ప్రస్తుతం వస్తున్న హార్రర్ సినిమాల వరకూ మనం ఎన్నో హార్రర్ మూవీస్ చూసి ఉంటాం. ఈనేపథ్యంలో హార్రర్ సినిమాలు అంటే మన మైండ్ లో కొన్ని ఎలిమెంట్స్ ఫిక్స్ అయి పోయి ఉంటాయి. ఒక ఇల్లు, అందులో దెయ్యం.. ఆ ఇంట్లోకి వచ్చిన వాళ్లని ఆ దెయ్యం ఆడుకోవడం.. లేక వాళ్లకి దెయ్యం ఆవహించటం.. మ్యాగ్జిమమ్ ఇవే ఉంటాయి. ఇక ఇదే పాత చింతకాయ పచ్చడి ఫార్ములాను అటు తిప్పి ఇటు తిప్పి హార్రర్ సినిమా అని తీసి బొక్క బోర్లా పడుతున్నారు కొంతమంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఈ ఫార్ములాను దాటి కాస్త బయటకు వచ్చి వైవిద్యం చూపించడానికి ప్రయత్నిస్తున్నాయి. అలా ప్రయత్నించిన సినిమానే రీసెంట్ గా రిలీజైన…

చీకటి గదిలో చితక్కొట్టుడు తెలుగు మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా ఫ్యామిలీస్ చూసే సినిమా కాదని చెప్పొచ్చు. హార్రర్ సినిమాలంటే ఇష్టపడే వాళ్లు చూడొచ్చు. యూత్ కి కూడా బాగానే కనెక్ట్ అవుతుంది.

'విలన్' పాత్రలపై ఇంట్రెస్ట్ చూపుతున్న హీరోలు
విలన్ 'హీరో' అయ్యాడు... విలన్ హీరో అవ్వడం ఏంటబ్బా అనుకుంటున్నారా..? ప్రస్తుతం సినీ పరిశ్రమలో చిన్న చిన్నగా నడుస్తున్న ట్రెండ్ ఇదే. ఇన్ని రోజులు హీరోలుగా హీరోయిజం చూపించి.. చూపించి మన హీరోలకు బోర్ కొట్టిందేమో తెలియదు కానీ విలన్ పాత్రలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒకప్పుడు విలన్ అంటే ఇలానే ఉండాలి అన్న థోరణికి స్వస్తి పలికి.. నేటి విలన్లు కూడా హీరోల్లాగా మేకోవర్ అవుతున్నారు. కొన్ని కొన్ని సినిమాల్లో అయితే హీరోల కంటే విలన్లే ఎక్కువ హ్యాండ్ సమ్ గా ఉంటున్నారు. దీనిలో భాగంగా తమలో ఉన్న నెగిటివ్ యాంగిల్ ను కూడా చూపించుకోవడానికి మంచి అవకాశం ఉండటంతో హీరో లు కూాడా…

మరో కొత్త సినిమాకు నితిన్ గ్రీన్ సిగ్నల్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కూడా మళ్లీ ఫామ్ లోకి వస్తున్నాడు. ఏడాదికి ఒక సినిమాకే ఫిక్స్ అవ్వకుండా రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే నితిన్ లిస్ట్ లో భీష్మ సినిమా ఉంది. వెంకీ కుడుముల డైరక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ నుండి సైట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

మన్మథుడు-2 మూవీలో రకుల్ ప్రీత్ సింగ్
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం, పండగ చేస్కో, నాన్నకు ప్రేమతో, ధృవ, రా రండోయ్ వేడుక చూద్దాం వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ స్పైడర్ మూవీ తరువాత టాలీవుడ్ కు దూరమయ్యారు. హిందీ, తమిళ మూవీస్ లో బిజీగా మారారు. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు లో శ్రీదేవి గా అతిథి పాత్రలో నటించి టాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చారు. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో బిజీగా మారుతున్నారు.

`క్వీన్` రీమేక్ కోసం అమితాబ్ గానం?
అమితాబ్ బచ్చన్... భారతీయ సినీ ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. నటనకు పర్యాయపదంలా నిలచిన ఈ నటగ్రంథం... ఈ ఏడాదితో 50 వసంతాల సినీ ప్రయాణం పూర్తిచేసుకుంటున్నారు. కేవలం హిందీ చిత్రాలకే పరిమితం కాకుండా... దక్షిణాది తెరపైనా తనదైన సంతకం చేశారాయన. అలాంటి అమితాబ్ కేవలం నటుడిగానే కాదు... గాయకుడిగానూ పలు జనరంజక గీతాలను ఆలపించారు. ఆయన పాడిన కొన్ని పాటలైతే... ఆ యా చిత్రాల విజయాల్లో భాగం కూడా అయ్యాయి. ఇప్పుడు మరోసారి తన గాత్రాన్ని సవరించుకోనున్నారు బిగ్ బి. అయితే... ఈ సారి హిందీ సినిమా కోసం కాదు... హిందీ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న దక్షిణాది…