నటసింహ నందమూరి బాలకృష్ణకి అచ్చొచ్చిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన `సింహా` (2010), `లెజెండ్` (2014) చిత్రాలు ఆ యా సంవత్సరాల్లో బాక్సాఫీస్‌కి కొత్త కళను తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో… ఐదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత వీరి కలయికలో మరో సినిమా రానుంది. గత చిత్రాల తరహాలోనే ఈ సారి కూడా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తోనే ఈ కాంబో పలకరించనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఎన్నికల హడావిడి పూర్తిగా ముగిసాకే… అంటే జూలై నెల ప్రాంతంలో మొదలవుతుందని టాలీవుడ్ టాక్. ఈ లోగా… ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నాడు బోయపాటి. అంతేకాదు… శరవేగంగా చిత్రీకరణ పూర్తిచేసి 2020 సంక్రాంతికి ఈ పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌ని బరిలోకి దింపే పనుల్లో ఉన్నాడాయన. మరి… ఈ చిత్రంతో బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్‌ని మూటగట్టుకుంటారేమో చూడాలి.
[youtube_video videoid=An5jOvff3RA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: