అనూప్ రూబెన్స్ స్వ‌ర‌విన్యాసాల‌కు 15 ఏళ్ళు

15 Years For Anup Rubens In Telugu Film Industry,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Anup Rubens Completes 15 Years in the Film Industry,Music Director Anup Rubens Latest News,15 Years For Anup Ruben in TFI,Anup Rubens SuccessFul Journey in Telugu Film Industry
15 Years For Anup Rubens In Telugu Film Industry

మెలోడీ పాట‌ల‌కు చిరునామాగా నిలిచిన ఈ త‌రం స్వ‌ర‌క‌ర్త‌ల్లో అనూప్ రూబెన్స్ ఒక‌రు. తొలి చిత్రం `జై` నుంచి గ‌త చిత్రం `హ‌లో` వ‌ర‌కు అనూప్‌ది ఇదే బాణి. కెరీర్ ఆరంభంలో ఆశించిన విజ‌యాలు ద‌క్క‌క‌పోయినా… ఒక సంగీత ద‌ర్శ‌కుడిగా అనూప్ ఏ సినిమాతోనూ స్వ‌రాభిమానుల‌ను నిరాశ‌ప‌ర‌చ‌లేద‌నే చెప్పాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

`ప్రేమ‌కావాలి`తో తొలి క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ అందుకున్న అనూప్ కి`ఇష్క్‌`తో కెరీర్‌ ఊపందుకుంది. ఆ త‌రువాత `మ‌నం`వంటి ఆల్ టైమ్ క్లాసిక్ మూవీకి బాణీలు అందించి… స్వ‌ర‌క‌ర్త‌గా మ‌రో మెట్టు ఎదిగాడు అనూప్‌. చిన్న చిత్రాల పాలిట క‌ల్ప త‌రువులా మారిన అనూప్‌… బాల‌కృష్ణ (పైసా వ‌సూల్‌), నాగార్జున (మ‌నం, సోగ్గాడే చిన్ని నాయ‌నా), ఎన్టీఆర్ (టెంప‌ర్‌) వంటి అగ్ర క‌థానాయ‌కుల చిత్రాల‌కూ కూడా విన‌సొంపైన బాణీలు అందించాడు. `హ‌లో`తో 50 చిత్రాల మైలురాయికి చేరుకున్న ఈ యువ స్వ‌ర‌త‌రంగం… ప్ర‌స్తుతం త‌న తొలి చిత్ర ద‌ర్శ‌కుడు తేజ రూపొందిస్తున్న‌`సీత‌`కి సంగీత‌మందిస్తున్నాడు. ఏప్రిల్ 25న ఈ సినిమా తెర‌పైకి రానుంది.

ఇంత‌కీ… అనూప్ గురించి ఈ ప్ర‌స్తావ‌న అంతా ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే… స‌రిగ్గా 15 ఏళ్ళ క్రితం ఇదే మార్చి 25న అనూప్ తొలిసారిగా సంగీత‌మందించిన `జై` (2004) చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అంటే… అత‌ని స్వ‌ర‌విన్యాసాలు ఒక‌టిన్న‌ర ద‌శాబ్దంగా శ్రోత‌ల‌ను అల‌రిస్తున్నాయ‌న్న‌మాట‌. మున్ముందు… ఈ టాలెంటెడ్ కంపోజ‌ర్ మ‌రిన్ని అంద‌మైన బాణీల‌తో ముందుకు సాగాల‌ని ఆకాంక్షిద్దాం.

[subscribe]

[youtube_video videoid=ZilWwswzGss]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 2 =