కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో సంచలన కథానాయికగా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్న. రెండు చోట్లా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ కన్నడ కస్తూరి… ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా నటిస్తున్న ఈ సినిమా… శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే… కార్తి సినిమా పూర్తయ్యే లోపే రష్మిక మరో తమిళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కోలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… తమిళనాట వరుస విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో కథానాయిక పాత్ర కోసం రష్మిక పేరు పరిశీలనలో ఉంది. త్వరలోనే రష్మిక ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా… ప్రస్తుతం రష్మిక తెలుగులో యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండకి జోడీగా `డియర్ కామ్రేడ్`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మే 31న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ కానుంది.
[youtube_video videoid=Xu8P7-r76sk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: