మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిఖిల్ :
ఈ హ్యాపీడేస్ హీరోకు 2016 లో వచ్చిన “ఎక్కడికి పోతావు చిన్నవాడా” తరువాత హిట్ లేదు. ఆ తరువాత వచ్చిన కేశవ, కిరాక్ పార్టీ చిత్రాలు నిరాశపరచడంతో రాబోయే చిత్రం “అర్జున్ సురవరం”మీదనే బోలెడు ఆశలు పెట్టుకున్నాడు నిఖిల్. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన “కణితన్” చిత్రాన్ని టీ. ఎన్. సంతోష్ దర్శకత్వంలో రీ మేక్ చేసి మే 1న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం తప్పకుండా విజయాన్ని సాధించాలని కోరుకుంటూ నిఖిల్ కు ఆల్ ద బెస్ట్ చెబుదాం…. ఎందుకంటే ఈ సినిమా హిట్ అవ్వకపోతే నిఖిల్ కెరీర్ ఫ్లాపుల్లో హ్యాట్రిక్ అనే ప్రమాదంలో పడుతుంది. సో ఆల్ ద బెస్ట్ టూ నిఖిల్.
నాగ చైతన్య:
అక్కినేని నాగచైతన్య , ఆయన నిజ జీవిత కథానాయిక సమంత జంటగా నటిస్తున్న “మజిలీ” ఏప్రిల్ 5న విడుదల కానుంది. అయితే ఇంతకుముందు నాగచైతన్యకు హిట్ వచ్చి చాలా కాలమైంది. “రారండోయ్ వేడుక చూద్దాం” తరువాత “ యుద్ధం శరణం”, శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి చిత్రాలు విడుదల అయినప్పటికీ వాటిలో శైలజా రెడ్డి అల్లుడు ఒక్కటే పర్వాలేదనిపించింది. ఈ నేపథ్యంలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఏప్రిల్ 5న విడుదల కానున్న ‘మజిలీ’ must and should గా హిట్ అవ్వవలసిన పరిస్థితి నెలకొంది. ‘మజిలీ’ హిట్ అయితే నాగ చైతన్య, సమంత కాంబినేషన్ కు హ్యాట్రిక్ దక్కినట్టే… గతంలో వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన ” ఏ మాయ చేసావే”, “మనం” చిత్రాలు హిట్టయ్యాయి కాబట్టి వారి కాంబినేషన్ కు మజిలీ హ్యాట్రిక్ హిట్ అవుతుంది. మధ్యలో ఆటోనగర్ సూర్య అనే ప్లాప్ ఉంది అన్న విషయం మీకు గుర్తు రాకపోతే…
సుమంత్ అశ్విన్ :
సాయి ధరమ్ తేజ్:
వరుస ప్లాపులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మరో యువ కథానాయకుడు సాయి ధరమ్ తేజ్. కెరీర్ బిగినింగ్ లో వరుస విజయాలు సాధించి మంచి ఫాంలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ కు ఎవరి దిష్టి తగిలిందో గాని ప్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ అనే అరుదైన చేదు అనుభవం ఎదురైంది. మంచి ఫామ్ తో దూసుకు వెళ్తున్న టైం లో ” తిక్క” అనే ఒక తిక్క సినిమా చేయడంతో ప్రారంభమైన ప్లాపుల పరంపర నక్షత్రం, విన్నర్, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు చిత్రాల వరకు కొనసాగింది. ఈ నేపథ్యంలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన “చిత్రలహరి” ఏప్రిల్ 12న విడుదల కానుంది. ఈ సినిమాతోనైనా మెగా హీరోసాయి ధరమ్ తేజ్ మరలా విజయాల బాట పట్టాలని ఆశిద్దాం.
నాని:
వరుస విజయాలతో దూసుకుపోతూ నెక్స్ట్ జనరేషన్ మినీ స్టార్ గా ఎదుగుతున్న నానికి ఎం.సీ.ఏ. తరువాత సరైన హిట్ లేదు. కృష్ణార్జున యుద్ధం ప్లాప్ అవ్వటం దేవదాస్ యావరేజ్ కావటంతో నాని ఫామ్ లో కొంత తేడా ఏర్పడింది. అయితే ఇది పెద్దంతగా పట్టించుకోవాల్సిన మేటర్ కాకపోయినప్పటికీ తదుపరి చిత్రం హిట్ అవ్వవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న “జెర్సీ” ఏప్రిల్ 19న విడుదల కానుంది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో నాని చేస్తున్న ఈ చిత్రం తనను మరలా ఫామ్ లోకి తెస్తుందని ఆశిద్దాం.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్:
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు కెరీర్ ప్రారంభ చిత్రంగా వచ్చిన “అల్లుడు శీను” తరువాత సరైన హిట్ లేదు. రెండవ చిత్రమైన “స్పీడున్నోడు” ప్లాప్ కాగా మూడవ చిత్రమైన “జయ జానకి నాయక” బాగుంది అనిపించుకున్నప్పటికీ దాన్ని కాస్ట్ ఫెయిల్యూర్ అని తేల్చేసింది ఫిలిమ్ ట్రేడ్. ఆ తరువాత వచ్చిన సాక్ష్యం, కవచం చిత్రాలు బాగా నిరాశ పరిచాయి. అయితే డాన్సులు, ఫైట్స్, పర్ఫార్మెన్స్ విషయంలో చాలా మంచి పేరు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఆ పేరుకు తగిన స్థాయిలో హిట్ పడవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు, ఛాయాగ్రహకుడు తేజ దర్శకత్వంలో కాజల్ టైటిల్ పాత్ర పోషిస్తున్న” సీత” చిత్రంలో హీరోగా నటిస్తున్న సాయి శ్రీనివాస్ కు ఈ 6వ చిత్రమైనా మంచి హిట్ ఇస్తుంది అని అంచనాలు ఉన్నాయి. కాగా ‘సీత’ ఏప్రిల్ 25న విడుదల కానుంది.
రామ్ పోతినేని :
టాలీవుడ్ లో వన్ అఫ్ ద ఎనర్జిటిక్ హీరోస్ గా పేరుపొందిన రామ్ కు “నేను శైలజ” తర్వాత సరైన హిట్ లేదు. హైపర్ , ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే చిత్రాలలో చివరిదైన హలో గురు ప్రేమకోసమే ఒక మోస్తరు విజయంగా నిలిచింది. ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటిస్తున్న” ఇస్మార్ట్ శంకర్” మే నెలలో విడుదల కానుంది. ఈ సినిమా హిట్ అవటం హీరోగా రామ్ కే కాదు… దర్శకుడిగా పూరికి కూడా అత్యావశ్యకం.
శర్వానంద్:
యువతరం కథానాయకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ను, బాడీ లాంగ్వేజ్ ని, ఇమేజ్ ని సంతరించుకున్న స్టైలిష్ హీరో శర్వానంద్. 2017 సంక్రాంతికి వచ్చిన “శతమానం భవతి” అద్భుత విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వచ్చిన శర్వానంద్ చిత్రాలు రాధా, మహానుభావుడు, పడి పడి లేచే మనసు చిత్రాలలో “మహానుభావుడు” ఒకటే పాస్ మార్కులు సంపాదించుకుంది. రాధా, పడి పడి లేచే మనసు డిజాస్టర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న పేరు పెట్టని చిత్రం కూడా మేలో విడుదల కానుంది. సో.. ఒక యావరేజ్, రెండు ప్లాపులతో కొనసాగుతున్న శర్వానంద్ కు రాబోయే చిత్రం తప్పకుండా హిట్ కావలసిన అత్యవసర స్థితి ఉంది కాబట్టి సుధీర్ వర్మ శర్వానంద్ ను ఏ మేరకు గట్టెక్కిస్తాడో చూడాలి.
మంచు విష్ణు:
విలక్షణ విశిష్ట నటుడు, నిర్మాత, విద్యావేత్త మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు కు కమర్షియల్ హీరోగానే కాకుండా బెస్ట్ పర్ఫార్మర్ గా కూడా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ ఆ స్థాయిలో సక్సెస్ అతన్ని వరించడం లేదు. వరుస పరాజయాలకు గురవుతున్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న మంచు విష్ణుకు మే నెలలో విడుదల కానున్న తాజా చిత్రం “ఓటర్” మంచి కం బ్యాక్ ఫిలిం అవుతుందేమో చూడాలి.
అల్లు శిరీష్:
సుప్రసిద్ధ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అయిన అల్లు శిరీష్ ఇప్పటివరకు నటించిన 4 చిత్రాలు విడుదలయ్యాయి. గౌరవం, కొత్తజంట, శ్రీరస్తూ శుభమస్తూ, ఒక్క క్షణం చిత్రాలలో ఒక్క శ్రీరస్తు శుభమస్తు మాత్రమే మంచి విజయాన్ని అందుకుంది. కాబట్టి కెరీర్ పటిష్టత దృష్ట్యా ప్రస్తుతం నిర్మాణంలో ఉండి మే నెలలో రిలీజ్ కు సిద్ధం అవుతున్న మలయాళ రీమేక్ “ABCD” కచ్చితంగా హిట్ అవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది. మంచి పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న అల్లు వారి చిన్నబ్బాయి ఈ సినిమాతో తప్పకుండా సక్సెస్ బాట పడతాడని ఆశిద్దాం.
[youtube_video videoid=jNZPdlUP7cc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: