సుధీర్ బాబు, నందిత హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ప్రేమ కథాచిత్రమ్ మూవీ కి సీక్వెల్ ప్రేమ కథాచిత్రమ్ 2 – బ్యాక్ టు ఫియర్ అనే ట్యాగ్ లైన్ తో సినిమా రూపొందుతున్న సంగతి కూడా విదితమే. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఈ చిత్రం ఈనెల 21న విడుదలకావాల్సి ఉండగా వాయిదాపడింది. ఇక తాజాగా ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా ఏప్రిల్ 6న విడుదల చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ ఫేమ్ నందితా శ్వేత కథానాయికగా నూతన దర్శకుడు హరి కిషన్ దర్శకత్వం లో రూపొందుతున్న ప్రేమ కథాచిత్రమ్ 2మూవీలో సుమంత్ అశ్వి న్, సిద్ది ఇద్నాని లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో కమెడియన్స్ ప్రభాస్ శ్రీను , విద్యుల్లేక రామన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్ సుదర్శన్ రెడ్డి నిర్మాణ సారధ్యం లో ఆర్ పి ఏ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జేబీ సంగీతం అందిస్తున్నాడు.
మరి ప్రేమకథా చిత్రమ్ మంచి సక్సెస్ సాధించింది.. ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చుతుందో..ఎంతవరకూ భయపెడతారో చూద్దాం..!
[youtube_video videoid=eSLPDtQqCmc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: