మళ్లీ మారిన అర్జున్ సురవరం రిలీజ్ డేట్

Change In Arjun Suravaram Movie Release Date Again,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nikhil Arjun Suravaram Movie Gets a New Release Date,Arjun Suravaram Movie Release Date PostPoned,Arjun Suravaram Movie Release Date Changed,Nikhil Arjun Suravaram Movie Latest Updates,Actor Nikhil New Movie Latest News
Change In Arjun Suravaram Movie Release Date Again

మొన్నటి వరకూ టైటిల్ విషయంలో ఇబ్బది పడ్డ నిఖిల్ సినిమా అర్జున్ సురవరం కు ఇప్పుడు రిలీజ్ విషయంలోనూ ఇబ్బందులు తప్పటంలేదు. రెండు రోజుల క్రితం మార్చి 29వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు వార్తలు రాగా ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ కూడా మార్చుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి ఉండటంతో ఈ టైంలో రిలీజ్ చేస్తే వసూళ్ల మీద ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారట. ఇక ఏప్రిల్ లో ఏలాగూ రిలీజ్ చేయలేరు. ఎందుకంటే ఇప్పటికే చాలా సినిమాలు ఏప్రిల్ ను బుక్ చేసుకున్నాయి. దీంతో ఈసినిమాను మే 1న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా టీం. టీఎన్‌ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తుంది. బి. మధు సమర్పణలో మూవీస్ డైనమిక్స్ LLP &ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ లో నిఖిల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా మొదటిసారి నటిస్తున్నారు. అంతేకాదు ఇటీవల రిలీజైన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నిఖిల్ కు ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ తెచ్చిపెడుతుందో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=nnl_cL9PZ8U]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + three =