ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా హార్రర్ సినిమాల హవా కొనసాగుతుంది. ఇన్ని రోజులు గ్లామర్ పాత్రలు చేసి బోరుకొట్టిన హీరోయిన్స్ సైతం దెయ్యంలా మారి ప్రేక్షకులను భయపెట్టడానికి ఏమాత్రం భయపడకుండా హార్రర్ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు తమన్నా కూడా ఆబాటలోనే నడుస్తోంది. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రలవైపే మొగ్గు చూపిన తమన్నా.. ఇప్పుడు ట్రాక్ మార్చి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు.. అందులో హార్రర్ సినిమాల పై దృష్టి పెట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే తమన్నా‘రాజుగారి గది 3’, ‘దేవి 2, సినిమాలు చేస్తుండగా.. తాజాగా తమన్నా మరో హార్రర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రానికి రోహిన్ వెంకటేశన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా ఈ స్క్రిప్ట్ నచ్చే సైన్ చేశానని మిల్కీ బ్యూటీ చెబుతుంది.
కాగా ‘రాజుగారి గది 3’ చిత్రానికి ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇవి కాకుండా చిరంజీవి ‘సైరా’ సినిమాలో నర్తకి లక్ష్మీ అనే ఓ కీలక పాత్రను తమన్నా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు బాలీవుడ్ క్వీన్ రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మీ సినిమాలో కూడా నటిస్తోంది. మొత్తానికి ఈ ఏడాది తమన్నాకు బాగానే కలిసొచ్చినట్టుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చేస్తుంది. మరి వీటిలో ఎన్ని సినిమాలు హిట్టవుతాయో చూద్దాం.
[youtube_video videoid=RlAavpy0zMQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: