గత ఏడాది వేసవికి `నా పేరు సూర్య`తో పలకరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… భారీ విరామం తరువాత తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించనున్న సంగతి తెలిసిందే. ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ సినిమా… త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. కాగా… తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన `కాలా` సినిమాలో నానా విలన్‌గా అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో తొలిసారిగా నానా నటించే ఇదే అవుతుంది. త్వరలోనే నానా ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. బన్నీకి జంటగా పూజా హెగ్డే నటించనున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=Qet0IxVPoe8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: