రానా నట ప్రస్థానం రాజకీయ నేపథ్య చిత్రాలతోనే మొదలైంది. `లీడర్` (2010)లో యువ ముఖ్యమంత్రి అర్జున్ ప్రసాద్‌గా పాత్రలో ఒదిగిపోయిన వైనం… రానాకి నటుడిగా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. కట్ చేస్తే… 2017లో విడుదలైన మరో రాజకీయ నేపథ్య చిత్రం `నేనే రాజు నేనే మంత్రి`లోనూ జోగేంద్రగా మెస్మరైజ్ చేశాడు రానా. ఈ రెండు చిత్రాలు సమకాలీన పరిస్థితులను దర్పణం పడుతూ తెరకెక్కిన సినిమాలు కాగా… ఈ సారి పిరియాడిక్ టచ్ ఉన్న పొలిటికల్ మూవీలో నటించబోతున్నాడట రానా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… సరిగ్గా ఏడాది క్రితం (మార్చి 23, 2018) విడుదలైన `నీదీ నాదీ ఒకే కథ`తో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన వేణు ఊడుగుల… తన తదుపరి చిత్రాన్ని రానా, సాయిపల్లవి కాంబినేషన్‌లో `విరాటపర్వం` పేరుతో పిరియాడికల్ డ్రామాగా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా… ఎమర్జెన్సీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రజాస్వామ్యం, మార్క్సిజం, మానవ హక్కులు తదితర విషయాల్ని టచ్ చేస్తున్నారని టాక్. అలాగే ఎమర్జెన్సీలో మొదలై… 1992తో ముగిసే కథ ఇదని సమాచారం.
ఇదిలా ఉంటే… ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు ఓ కీలక పాత్రలో నటించనున్నారని టాలీవుడ్ టాక్. మానవ హక్కుల కార్యకర్తగా ఆమె పాత్ర ఉంటుందట. ఆసక్తికరమైన విషయమేమిటంటే… టబు తొలి తెలుగు చిత్రం `కూలీ నెం.1`ని నిర్మించిన డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. జూలైలో చిత్రీకరణ ప్రారంభించుకోనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
[youtube_video videoid=VSX2aGKj81g]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: