కాజల్ అగర్వాల్… టాలీవుడ్ చందమామ. అంతేకాదు… ఈ తరం అగ్ర కథానాయకులందరికి కలిసొచ్చిన కథానాయిక. ముఖ్యంగా… యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ `డార్లింగ్`(2010), `మిస్టర్ పర్‌ఫెక్ట్`(2011) చిత్రాల్లో నాయికగా నటించడమే కాదు… రెండు ఘనవిజయాలను తన ఖాతాలో వేసుకుని మరీ వార్తల్లో నిలచింది కాజల్. కట్ చేస్తే… దాదాపు ఎనిమిదేళ్ళ తరువాత ఈ ఉత్తరాది సోయగం… ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `జిల్` రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ పిరియాడికల్ లవ్ స్టోరీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ 20గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి `జాన్` అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కాగా… పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ చందమామ కాజల్ కూడా దర్శనమివ్వనుందట. అయితే… కథానాయికగా కాదు.. ఓ అతిథి పాత్రలో. కొన్ని సన్నివేశాలు, ఒక కలర్‌ఫుల్ సాంగ్ ప్రభాస్, కాజల్ కాంబినేషన్‌లో ఉంటాయని టాక్. త్వరలోనే కాజల్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. ఈ కథనం గనుక నిజమైతే… ఈ లవబుల్ జోడీ హ్యాట్రిక్‌కి సిద్ధమైనట్టే.
[youtube_video videoid=hKDnz0e6338]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: