సొంతం, నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి ఇలా చెప్పుకుంటూ పోతే సునీల్ తన కామెడీ టైమింగ్ తో చంపేసిన సినిమాలు లిస్ట్ పెరుగుతూపోతుంది. గోదారోళ్లకి కాస్త ఎటకారం ఎక్కువ అన్నట్టు… ఆ ఎటకారం మొత్తం తన పంచ్ డైలాగుల్లోనే కనిపించేట్టు పంచులు వేయడంలో.. ఓ డిఫరెంట్ వాయిస్ తో కామెడీ చేయడంలో సునీల్ రూటే సెపరేటు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినీ ఇండస్ట్రీలోకి రావడానికి ఏమైనా కష్టపడ్డాడేమో కానీ.. తనదైన టైమింగ్ తో .. మేనరిజంతో కమెడియన్ గా కెరిర్ ను మొదలుపెట్టిన సునీల్ అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. కాస్త పాత జనరేషన్ కి బ్రహ్మనందం అయితే.. ఆ తరువాత వచ్చిన జనరేషన్ కి సునీలే కామెడీ కింగ్ అన్న రేంజ్ లో పేరు తెచ్చుకున్నాడు. ఇక కమెడియన్ గా తన సత్తా చాటిన సునీల్… హీరోగా ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నాడనే చెప్పొచ్చు.
అందాల రాముడు సినిమాతో హీరోగా తొలి ప్రయత్నం చేయగా అది కాస్త హిట్ అయింది. దాంతో ఆ తరువాత మరిన్ని ప్రయత్నాలు చేశాడు..ఆఖరికి సిక్స్ ప్యాక్ కూాడా చేశాడు. కానీ విజయాలు ముఖం చాటేశాయి. దాంతో అటు కమెడియన్ గా చేయలేక.. మళ్లీ హీరోగా ధైర్యం చేయలేక కొన్నాళ్లు సినిమాలకే దూరంగా ఉన్నాడు. ఇక ఇప్పుడు మళ్లీ కమెడియన్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ‘అరవింద సమేత’ చిత్రం ద్వారా కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘చిత్రలహరి’లో కూడా సునీల్ కీలక పాత్రలో నటించాడు. దానితో పాటు ప్రస్తుతం 5 సినిమాలతో బిజీగా వున్నాడు. మరో మూడు సినిమాలు సెట్స్ పైన వున్నాయి. ఇక బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా సునీల్ కోసం త్రివిక్రమ్ ఒక డిఫరెంట్ రోల్ ను డిజైన్ చేస్తున్నాడట.
అయితే ఇక్కడే ఒక చిన్న తేడా ఉందని చెప్పొచ్చు. అప్పట్లో సునీల్ చేసే కామెడీకి భయంకరంగా నవ్వొచ్దేది కానీ.. ఇప్పుడు కాస్త మెకానికల్ గా చేసినట్టు.. నవ్వు రావడం కాస్త కష్టంగానే ఉంది. ఒకప్పుడు కమెడియన్స్ అంటే సెలక్టివ్ గా ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు కాలం మారింది. రోజుకో కమెడియన్ ఇండస్ట్రీకి వస్తున్నాడు. కాంపిటీషన్ పెరిగిపోయింది. సో ఈసారి మళ్లీ ట్రాక్ తప్పితే మాత్రం కష్టమే… ఏది ఏమైనా మొత్తానికి సునీల్ మళ్లీ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వడం హ్యాపీ థింగే. మళ్లీ హీరో పాత్రల జోలికి వెళ్లకుండా.. ఒకవేళ వెళ్లినా… వాటికే ఫిక్స్ అయిపోకుండా కమెడియన్ గా మాత్రం రాణించాలని కోరుకుందాం…
[youtube_video videoid=ljuuaB-AANI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: